CJI NV Ramana: గ్రామానికి బస్సు కోసం సీజేఐకి చిన్నారి లేఖ.. స్పందించిన సీజేఐ..

8 Years Old Girl Student Written Letter to CJI NV Ramana to Arrange Bus to Her Village for Going to School | Live News
x

CJI NV Ramana: గ్రామానికి బస్సు కోసం సీజేఐకి చిన్నారి లేఖ

Highlights

CJI NV Ramana: బస్సు సౌకర్యం కల్పించాలంటూ టీఎస్ ఆర్టీసీ అధికారులకు సూచన...

CJI NV Ramana: బడికి వెళ్లాలంటే బస్సు లేదంటూ.. ఓ చిన్నారి సుప్రీంకోర్టు ప్రదాన న్యాయమూర్తి దృష్టికి తీసుకు వెళ్లింది. విద్యార్ధిని అభ్యర్ధనపై స్పందించిన చీఫ్ జస్టిస్ ఈ విషయాన్ని తెలంగాణ ఆర్టీసీ అధికారులకు విన్నవించారు. ఆ వెంటనే స్పందించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆ పల్లెకు బస్సుసౌకర్యాన్ని కల్పించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడు గ్రామానికి చెందిన వైష్ణవి 8వ తరగతి చదువుతుంది.

తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగా నడపడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వైష్ణవి తండ్రి ఇటీవల కరోనాతో చనిపోయాడు. తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ సమయంలో వైష్ణవి అక్కా, తమ్ముడుతో కలిసి నిత్యం దాదాపు పది కిలో మీటర్ల దూరం ఆటోలో వెళ్లి చదువుకుంటున్నారు. తమకు ఆర్ధిక స్థోమత లేకపోవడంతో చదువు మానుకోవాలని నిర్ణయానికి వచ్చారు.

ఆ వెంటనే చిన్నారి వైష్ణవి..తమతో పాటు ఇతర విద్యార్ధులు పడుతున్న కష్టాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రూపంలో తెలియచేసింది. కరోనా లాక్ డౌన్ విధించడానికి ముందు చీదేడు గ్రామానికి బస్సు సౌకర్యం ఉండేది. తిరిగి పునరుద్దరించకపోవడంతో గ్రామస్థులతో పాటు విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారి ఆవేదనతో ఎప్పటి మాదిరిగా బస్సులు నడుపడంటం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories