పార్లమెంట్‌లో కొనసాగుతున్న ఎంపీల ధర్నా...

పార్లమెంట్‌లో కొనసాగుతున్న ఎంపీల ధర్నా...
x
Highlights

రాజ్య‌స‌భ‌లో కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎంపీలు ప‌రిధి దాటారు అంటూ చైర్మ‌న్ 8మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. స‌భ నుండి...

రాజ్య‌స‌భ‌లో కేంద్ర వ్య‌వ‌సాయ బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా ఎంపీలు ప‌రిధి దాటారు అంటూ చైర్మ‌న్ 8మంది ఎంపీల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేశారు. స‌భ నుండి స‌స్పెండ్ అయిన ఎంపీలంతా సోమ‌వారం మ‌ద్యాహ్నాం నుండి పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న‌కు దిగారు. రాత్రంతా అక్క‌డే ఉండి నిర‌స‌న తెలుపుతూనే ఉన్నారు. ఆమాద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తమ ధర్నా తాలూకు ఫోటోలు, వీడియోలను ట్విటర్లో షేర్ చేసుకున్నారు.

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తమకు టీ, స్నాక్స్ తీసుకుని వచ్చారనీ అయితే వాటిని తాము తిరస్కరించామని ఆయన వెల్లడించారు. ఇవాళ ఉదయం డిప్యూటీ చైర్మన్ మమ్మల్ని కలుసేందుకు ధర్నా స్థలి వద్దకు వచ్చారు. అయితే రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చట్టాన్ని ఆమోదించారనీ బీజేపీ మైనారిటీలో ఉండగా ఎలాంటి ఓటింగ్ లేకుండా రైతు వ్యతిరేక బిల్లులను ఆమోదించారని మేము చెప్పాం. అందుకు మీరే కారణమని కూడా ఆయనకు స్పష్టం చేశాం అని సంజయ్ వెల్లడించారు.



Show Full Article
Print Article
Next Story
More Stories