సార్వత్రిక ఎన్నికల్లో తుది సమరానికి సర్వం సిద్ధం.. నేటితో ముగియనున్న ఏడో విడత ఎన్నికల ప్రచారం

7th Phase Lok Sabha Election 2024 Campaign Close Today
x

సార్వత్రిక ఎన్నికల్లో తుది సమరానికి సర్వం సిద్ధం.. నేటితో ముగియనున్న ఏడో విడత ఎన్నికల ప్రచారం

Highlights

7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో తుది విడుత సమరానికి సర్వం సిద్ధం అయ్యింది.

7th Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో తుది విడుత సమరానికి సర్వం సిద్ధం అయ్యింది. జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో దశ ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఆఖరి దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగుంది. ఏడోదశలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బిహార్‌లోని 8 లోక్‌సభ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్‌లోని 4 స్థానాలకు, ఝార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, బెంగాల్ 9 స్థానాలతో పాటు చండీగఢ్‌కు తుదిదశలోనే పోలింగ్ జరగనుంది.

కాగా.. ఇప్పటికే ఆరుదశల్లో ముగిసిన ఎన్నికలల్లో 486 స్థానాలకు పోలింగ్ పూర్తైంది. ఇక పంజాబ్‌లోని 13 లోక్‌సభ స్థానాలకు హిమాచల్ ప్రదేశ్‌లోని 4 లోక్ సభ స్థానాలకు ఏడోదశలో ఒకే సారి పోలింగ్ పూర్తి కానుంది. జూన్1వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడే అవకాశ ఉన్నట్టు తెలుస్తుంది. కాగా.. ఏడో దశలో ప్రధాని మోడీ వారణాసి నుంచి పోటీలో నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories