Corona Cases in India: భారత్ లో కొత్తగా 70,421 కేసులు న‌మోదు

70,421 New Corona Cases in India Reports Today 14 06 2021
x

Representational Image

Highlights

Corona Cases in India: దేశంలో 71రోజుల కనిష్టానికి కోవిడ్ కేసులు

Corona Cases in India: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ కంట్రోల్‌లోకి వస్తోంది. క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తోన్న కేసులు ఈరోజు మరింత తగ్గాయి. గత 24గంటల్లో 81వేల దిగువన కేసులు నమోదు కాగా, 71రోజుల కనిష్టానికి రోజువారీ కేసులు చేరుకున్నాయి. అయితే, మరణాలు మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. ప్రతిరోజూ మూడు వేల వరకు మృత్యువాత పడుతూనే ఉన్నారు. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 3వేల 303మంది కరోనాకు బలైపోయారు. దాంతో, దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 3లక్షల 70వేల 384కి చేరింది. ప్రస్తుతం దేశంలో 10లక్షల 26వేల 159 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్ర‌మంగా త‌గ్గిపోతోంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 70,421 కేసులు న‌మోద‌య్యాయి. ఏప్రిల్ 1 త‌ర్వాత ఇంత త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వ‌డం ఇదే తొలిసారి. అయితే మ‌ర‌ణాల సంఖ్య మాత్రం కాస్త ఎక్కువ‌గానే ఉంది. 24 గంట‌ల్లో 3921 మంది క‌రోనాతో మృత్యువాత ప‌డ్డారు. ఇక 1,19,501 మంది క‌రోనా నుంచి కోలుకొని ఇళ్ల‌కు వెళ్లారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 2,95,10,410కి చేరింది. కోలుకున్న వారు 2,81,62,947 కాగా.. చ‌నిపోయిన వారి సంఖ్య 3,74,305కి చేరింది. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసులు 9,73,158 ఉన్నాయి. ఇక వ్యాక్సినేష‌న్ల సంఖ్య 25,48,49,301కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories