Viral Video: 70 ఏళ్ల వయసులో స్కైడైవింగ్.. చత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి సాహసం..

70-year-old Chhattisgarh Minister TS Singh Deo goes skydiving in Australia
x

Viral Video: 70 ఏళ్ల వయసులో స్కైడైవింగ్.. చత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి సాహసం.. 

Highlights

Viral Video: వీడియో చూసి ఆశ్చర్యపోయిన ముఖ్యమంత్రి

Viral Video: ఉత్సాహానికి, సాహసానికి వయసు అడ్డంకి కాదని నిరూపించారు ఛత్తీస్‌గఢ్ ఆరోగ్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ దియో. 70 ఏళ్ల వయసులోనూ ఆయన డైవింగ్ చేశారు. తన మంత్రి వర్గ సహచరుడి సాహసక్రీడ చూసి ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బాఘేల్‌ కూడా ఆశ్చర్యపోయారు. ఇటీవల టీఎస్ సింగ్ దియో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అక్కడ మంత్రికి స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చింది. స్కైడైవింగ్ అంటే విమానంలోంచి పారాచూట్ సాయంతో కిందకు దూకడం. ఈ క్రమంలో మంత్రి ఉత్సాహంగా స్కైడైవింగ్ చేశారు. తాను పారాచూట్ సాయంతో విమానంలోంచి దూకుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆకాశానికి హద్దు లేదు. ఆస్ట్రేలియాలో ఈసారి తనకు స్కైడైవింగ్ చేసే అవకాశం వచ్చిందని, ఇదో అద్భుతమైన అనుభవం.. ఆసాంతం ఆస్వాదించానంటూ టీఎస్ సింగ్ దియో కామెంట్ చేశారు. సీనియర్ స్కైడైవర్ సాయంతో టీఎస్ సింగ్ ఈ సాహస క్రీడకు పూనుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories