Actor Darshan: జైలులో దర్శన్ రాజభోగాలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పరమేశ్వర్

7 Prison Officials Suspended Over VIP Treatment For Kannada Actor Darshan In Jail
x

Actor Darshan: జైలులో దర్శన్ రాజభోగాలపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్.. కీలక ఆదేశాలిచ్చిన మంత్రి పరమేశ్వర్

Highlights

అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ హిరో దర్శన్ తూగుదీప్ జైలులో ఉన్నాడు. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, వీడియో ఒక దాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వచ్చాయి.

Actor Darshan: జైల్లో కన్నడ హిరో దర్శన్ రాజభోగాలపై కర్ణాటక ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిన్న సాయంత్రం నుంచి అధికారులు విచారణ ప్రారంభించినట్లు మంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. ఏడుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పొరపాటు జరిగిందని మరోసారి ఇలాంటివి పునరావృతం కావని మంత్రి హామి ఇచ్చారు. తమపైన సైతం కొంత బాధ్యత ఉందన్నారు కర్ణాటక మంత్రి పరమేశ్వర్.

అభిమాని రేణుకాస్వామి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ హిరో దర్శన్ తూగుదీప్ జైలులో ఉన్నాడు. జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు, వీడియో ఒక దాని తర్వాత ఒకటిగా వెలుగులోకి వచ్చాయి. మొన్న జైలు ఓపెన్ లాన్‌లో కొందరితో కలిసి కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ సేదదీరుతూ ఉన్న దర్శన్ ఫొటో వైరల్ కాగా, నిన్న ఎవరితోనో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.

బయటకు వచ్చిన దర్శన్ వీడియోలు, ఫొటోలపై రేణుకాస్వామి తండ్రి శివగౌడ ఆవేదనగా స్పందించారు. నటుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులపైనా, న్యాయవ్యవస్థపైనా తనకు నమ్మకం ఉందని, దర్శన్ జైలులో రాజభోగాలు ఎలా అనుభవిస్తున్నాడో తనకు అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories