చాక్లెట్లు ఆశచూపి.. ఏడేళ్ల బాలికపై 65ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

చాక్లెట్లు ఆశచూపి.. ఏడేళ్ల బాలికపై 65ఏళ్ల వృద్ధుడి అత్యాచారం
x
Highlights

భారత్‌ను పీడిస్తున్న హేయమయిన నేరాల్లో బాలికలపై అత్యాచారాలు ఒకటి. ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్న ఈ నేరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ...

భారత్‌ను పీడిస్తున్న హేయమయిన నేరాల్లో బాలికలపై అత్యాచారాలు ఒకటి. ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్న ఈ నేరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ జరుగుతూనే ఉందంటే ఆశ్చర్యం కాదు. వీటిని అరికట్టేందుకు ఎన్ని చట్టాలున్నా కానీ ఈ నేరాలు తగ్గక పోగా రోజురోజుకు అత్యాచారా ఘటనలు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదు. పసి పిల్లలపై మానవమృగాలు రెచ్చిపోతున్నాయి. అయితే అత్యాచారాలు చేసే వారిలో కాటికి వెళ్లే మెుసల్లోళ్లు సైతం చిన్నారులపై తమ కామ కోరికను తీర్చుకుంటున్న దుస్థితి నెలకొంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని ఏడేళ్ల బాలికపై 65 ఏళ్ల వృద్దుడు అత్యాచారానికి ఒడిగట్టడం ఇప్పడు కలకలం రేపింది. కోల్‌కతాలోని సాల్ట్ లెక్ ప్రాంత్రంలో సీడీ బ్లాక్ లోని ఓ అపార్టుమెంటులో దంపతులు ఏడేళ్ల బాలికతో జీవనం సాగిస్తున్నారు. చిన్నారి తండ్రి ఇదే అపార్టుమెంట్లో ఓ ఫ్యామిలీకి కేర్ టేకర్‌ పనిచేస్తున్నాడు.

కాగా శనివారం ఉదయం బాలిక తండ్రి కూరగాయాలు కొనడానికి బయటకు వెళ్లగా చిన్నారి బయట ఆడుకుంటుంది. వారి ఇంటి సమీపంలో స్టేషనరీ షాపు నిర్వహిస్తున్న 65ఏళ్ల వృద్దుడి కన్ను బయట ఆడుకుంటున్న బాలికపై పడింది. తండ్రి బయటకు వెళ్లింది గమనించిన ఆ వృద్థుడు ఆ చిన్నారి దగ్గరకు వెళ్లి చాక్లెట్స్ ఇస్తానని బాలికను పిలిచిన వృద్ధుడు షాపు లోపలికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తమ కుమార్తే ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోన చెందిన తల్లి చుట్టుప్రక్కల వెతకడం మొదలుపెట్టింది. ఆ తల్లి వృద్దుడి షాపు దగ్గరకు రావడాన్ని గమనించన వృద్థుడు అక్కడి నుండి జంప్ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన తల్లి షాపులోపలికి వెళ్లిన తల్లి తన కుమార్తేను చూసి కంగుతిన్నది. తన బిడ్డ జననాంగాల వద్ద రక్తస్తావంతో పడి ఉంది. వెంటనే హుటాహుటిన దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తరలించగా పాపపై అత్యాచారం జరిగిందని వైద్యులు వెల్లడించారు. వెంటనే పోలీసు ఠాణాలో ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకొని పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మహిళ సంఘాలు భగ్గమంటున్నాయి. వెంటనే ఆ కీచకుడ్ని ఊరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories