ఆరుగురికి కరోనా : ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్

ఆరుగురికి కరోనా : ఈడీ ప్రధాన కార్యాలయం సీజ్
x
Highlights

ఢిల్లీలో ఆరుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు కరోనావైరస్ సోకింది. దాంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న...

ఢిల్లీలో ఆరుగురు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులకు కరోనావైరస్ సోకింది. దాంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల పాటు సీలు చేశారు. ప్రస్తుతం శానిటైజేషన్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు కరోనా సోకిన అధికారులతో సంప్రదింపులు జరిపిన 10 మందికి పైగా అధికారులను నిర్బంధంలో ఉంచినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల, ప్రధాన కార్యాలయంలో పనిచేసే జూనియర్-ర్యాంక్ అధికారికి వైరస్ పాజిటివ్ అని తేలింది. అతను కేంద్ర పారామిలిటరీ ఫోర్స్ నుండి దర్యాప్తు సంస్థకు డిప్యుటేషన్ ద్వారా వచ్చారు అని, వార్తా సంస్థ పిటిఐ నివేదించింది.

ఇదిలావుంటే ఢిల్లీలో ఇప్పటివరకు 26,334 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,887 కొత్త కేసులు నమోదు కాగా.. 294 మరణాలు సంభవించాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,36,657గా ఉంది.. అలాగే మరణాల సంఖ్య 6,642కు చేరింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories