Airforce: వాయుసేనకు 56 సీ-295 విమానాలు

56 C-259 Flights to Indian Air Force
x
భారత్కు రానున్న 56 కొత్త విమానాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

స్పెయిన్‌కు చెందిన ప్రైవేట్ సంస్థతో డీల్ 16 విమానాలు నేరుగా దిగుమతి

Airforce: భారత వాయుసేనకు కొత్తగా 56 రవాణా విమానాలు అందుబాటులోకి రానున్నాయి. స్పెయిన్‌కు చెందిన ఎయిర్ బస్ డిఫెన్స్ నుంచి 56 సీ-295 ఎండబ్ల్యూ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. స్పెయిన్‌కు చెందిన ఈ సంస్థ 40 విమానాలను భారత్‌లోనే తయారు చేయనుంది. 56 రవాణా విమానాల్లో 16 విమానాలను ఒప్పందం కుదిరిన 48 నెలల్లోగా స్పెయిన్‌ నుంచి నేరుగా వాయుసేనకు అందించాల్సి ఉంటుంది. మిగిలిన 40 విమానాలను భారత్‌లోనే టాటా కన్సార్షియం పదేళ్లలోగా తయారు చేయనుందని రక్షణ శాఖ తెలిపింది.

వైమానిక దళానికి చెందిన రవాణా విమానాలను భారత్‌లో తయారు చేయనుండడం ఇదే తొలిసారి. సీ-295 ఎమ్‌డబ్ల్యూ.. 5-10 టన్నుల సామర్థ్యం కలిగిన అధునాతన విమానం. భారత వైమానిక దళానికి చెందిన పాత ఆవ్రో విమానాల స్థానంలో వీటిని తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల అత్యధిక నైపుణ్యం కలిగిన 600 ఉద్యోగాలు నేరుగాను, 3 వేల కొలువులు పరోక్షంగాను లభిస్తాయని తెలిపింది. అదనంగా 3000 మధ్యస్థ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొంది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories