ఎమెర్జెన్సీకి 45 సంవ‌త్సరాలు పూర్తి.. అమిత్ షా ట్వీట్

ఎమెర్జెన్సీకి 45 సంవ‌త్సరాలు పూర్తి.. అమిత్ షా ట్వీట్
x
Highlights

దేశంలో ఎమెర్జెన్సీ విధించి నేటితో 45 సంవ‌త్సరాలు పూర్తైన నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.

దేశంలో ఎమెర్జెన్సీ విధించి నేటితో 45 సంవ‌త్సరాలు పూర్తైన నేప‌థ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఒక్క కుటుంబం పదవీకాంక్ష... దేశాన్ని రాత్రికి రాత్రే జైలుగా మార్చిందని ఇందిరా కుటుంబాన్ని ఉద్దేశించి ఆయ‌న ట్వీట్ చేశారు. అప్పట్లో పార్టీ, దేశ ప్రయోజనాల కంటే ఓ కుటుంబ ప్రయోజనాలే ఎక్కువ‌య్యాయని, ఇప్పటికీ కాంగ్రెస్‌ అలాగే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇదే పరిస్థితిని కొనసాగించడం బాధాకరమని పేర్కొన్నారు.

ఎమర్జెన్సీ తరహా మనస‍్తత్వం ఇంకా పార్టీలో ఎందుకు కొనసాగుతోందని, పార్టీలో ఇతర నేతలను ఎందుకు మాట్లాడనివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో నేతలు ఎందుకు ఇమడలేకపోతున్నారనేది తెలుసుకోవాలని అమిత్ షా అన్నారు. మరోవైపు కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ సమావేశంలో సీనియర్‌ సభ్యులు, యువ సభ్యులు కొన్ని అంశాలు లేవనెత్తగా వారిని మాట్లాడనీయకుండా గొంతు నొక్కారని, ఈ విషయంలో పార్టీ నేత ఒకరిపై అనవసరంగా వేటువేశారని అమిత్ షా ఆరోపించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories