22 ఏళ్లలో ఎన్డీఏను విడిచిపెట్టిన 29 పార్టీలు.. ప్రస్తుతం ఎన్నంటే..

22 ఏళ్లలో ఎన్డీఏను విడిచిపెట్టిన 29 పార్టీలు.. ప్రస్తుతం ఎన్నంటే..
x
Highlights

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఎన్‌డిఎ కు చెందిన పురాతన మిత్రపక్షాలలో ఒకటైన శిరోమణి అకాలీదళ్ తిరుగుబాటు వైఖరిని అవలంబించింది. ఎన్డీఏ ప్రభుత్వంలోని..

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. ఎన్‌డిఎ కు చెందిన పురాతన మిత్రపక్షాలలో ఒకటైన శిరోమణి అకాలీదళ్ తిరుగుబాటు వైఖరిని అవలంబించింది. ఎన్డీఏ ప్రభుత్వంలోని అకాలీదళ్ కోటాకు చెందిన ఏకైక కేబినెట్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ గురువారం రాజీనామా చేశారు. రాబోయే రోజులల్లో అకాలీదళ్ ఎన్డీఏలో భాగమవుతుందా? దీనిపై పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎన్డీఏ ఏర్పడి 22 సంవత్సరాలు అయ్యింది. ఈ 22 ఏళ్లలో 29 పార్టీలు ఎన్డీఏను వదిలి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఎన్డీఏలో 26 పార్టీలు ఉన్నాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్ , మాజీ ఉపప్రధాని ఎల్‌కె అద్వానీల సహకారంతో ఎన్డీఏ ఏర్పాటైంది.

ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ .. ఈ కూటమి 1998 లో ఏర్పడింది. 1998 నుండి 2004 వరకు, కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో బిజెపి ప్రభుత్వాన్ని నడిపించింది. ఎన్డీయేలోని పార్టీలు ఇప్పటివరకు ఆరు లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీ చేశాయి. ఎన్డీఏకు మొదటి చైర్మన్ అటల్ బిహారీ వాజ్‌పేయి అయితే.. రెండో చైర్మన్ అద్వానీయే.. ఈయన 2004 నుండి 2012 వరకు ఛైర్మన్‌గా ఉన్నారు. ఇక ఎన్డీఏలో రెండవ ముఖ్యమైన పోస్ట్ కన్వీనర్.. మొదటి ఎన్డీఏ కన్వీనర్ గా జార్జ్ ఫెర్నాండెజ్ పనిచేశారు. ప్రస్తుతం అమిత్ షా ఎన్డీఏ చైర్మన్ కాగా.. కన్వీనర్ పోస్టు ఖాళీగా ఉంది.

1998 లో, ఎల్.కె. అద్వానీ , అటల్ బిహారీ బాజ్‌పేయి ఎన్డీఏను ఏర్పాటు చేసిన సమయంలో.. జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలోని సమతా పార్టీ, జయలలిత ఎఐఎడిఎంకె, ప్రకాష్ సింగ్ బాదల్ అకాలీదళ్ , బాలాసాహెబ్ థాకరే నేతృత్వంలోని శివసేన వంటి పార్టీలు చేరాయి. ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ కూడా అప్పట్లో ఎన్డీఏలో చేరింది. 2013 లో బిజెపి నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా నిర్ణయించిన సమయంలో, 29 పార్టీలు ఎన్డీయేలో ఉన్నాయి.2014 సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి ఒక్కటే 282 సీట్లు గెలుచుకోగా, ఎన్‌డిఎలోని మిగతా 11 మంది భాగస్వాములు 54 సీట్లు గెలుచుకోగలిగారు. ఎన్నికలు జరిగిన తరువాత కూడా చాలా పార్టీలు ఎన్డీఏకు దగ్గరయ్యాయి, అయితే మోడీ ప్రధాని అయిన 5 సంవత్సరాలలో 16 పార్టీలు ఎన్డీఏ నుంచి నిష్క్రమించాయి.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ఎన్‌డిఎలో ఎఐఎడిఎంకె, శివసేన, జెడియు, ఎల్‌జెపి, అకాలీదళ్, అప్నా దళ్, పిఎంకె, ఆర్‌పిఐ, బోడో ల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్, ఎఐఎన్ఆర్ కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, నేషనల్ పీపుల్స్ పార్టీ, మిజో నేషనల్ ఫ్రంట్, రాష్ట్రీయ సమాజ్ పక్ష, కెఎండికె, ఇండియా జన్నాయ కచ్చి, గోమంటక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీ, కేరళ కాంగ్రెస్ జాతీయవాది, సుహైల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ వంటి 42 పార్టీలు ఉన్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏలో చేరడానికి 21 పార్టీలు పోటీపడ్డాయి. వీటిలో బిజెపితో సహా 13 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఎన్డీఏకు మొత్తం 354 సీట్లు వచ్చాయి. అందులో బిజెపికి 303 సీట్లు, ఇతర 12 పార్టీలకు 51 సీట్లు వచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు రాష్ట్రాల్లో బిజెపి ఓడిపోయింది. అంతేకాదు శివసేన మరియు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ పార్టీలు ఎన్డిఎ నుండి వైదొలిగాయి, ఆ రెండు పార్టీలకు 19 మంది ఎంపీలు ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏలో 26 పార్టీలు ఉన్నాయి. వీటిలో లోక్ సభ లేదా రాజ్యసభలో 17 పార్టీలు ఉన్నాయి. ఎన్డీఏకు ప్రస్తుతం లోక్ సభలో 336, రాజ్యసభలో 117 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ 18 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories