Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభణ.. కొత్తగా 17 కేసుల నిర్ధారణ

17 Omicron Variant Cases Confirmed in India till Today and Cases Increasing Rapidly | Omicron Cases Live Updates
x

Omicron Cases in India: భారత్‌లో ఒమిక్రాన్‌ విజృంభణ.. కొత్తగా 17 కేసుల నిర్ధారణ

Highlights

Omicron Cases in India: *రాజస్థాన్‌లో ఒకేరోజు 9 మందికి పాజిటివ్‌ *మహారాష్ట్రలో 7, ఢిల్లీలో ఒకరికి ఒమిక్రాన్‌

Omicron Cases in India: మహారాష్ట్ర, రాజస్థాన్‌లో ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న రాజస్థాన్‌లో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఏడుగురు దీని బారినపడినట్లు నిర్ధారణ అయింది. ఢిల్లీలోనూ ఒక కేసు నమోదైంది. దీంతో ఒక్కరోజులోనే 17 కేసులు వచ్చి.., దేశవ్యాప్తంగా 21కి పెరిగింది. వీరిలో దాదాపు అందరూ ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లిన వచ్చినవారు లేదా అలాంటివారికి సన్నిహితంగా ఉన్నవారేనంటూ అధికారులు భావిస్తున్నారు.

ఒమిక్రాన్‌కు అడ్డుకట్ట వేయాలంటే అంతర్జాతీయ విమానాలన్నింటినీ నిషేధించడం అవసరమన్నారు ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌. ప్రమాదకరంగా భావిస్తోన్న ఈ వేరియంట్‌ ఇప్పటికే 30కిపైగా దేశాలకు విస్తరించింది. దీంతో ఆయా దేశాలు కట్టడి చర్యలు ముమ్మరం చేశాయి. వైరస్‌ సంక్రమణ రేటు ఎక్కువగా ఉండడం వల్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఒమిక్రాన్‌ను ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించింది.

కరోనా మూడోదశ ఒమిక్రాన్‌ ప్రభావం స్వల్పంగానే ఉండనున్నట్లు చెబుతున్నారు శాస్త్రవేత్తలు. కాగా.. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అది గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. మరోవైపు ఒమిక్రాన్‌కు భయపడాల్సిందేమీ లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందంటున్నారు వైద్యులు. ఇక మూడో దశ రావడం ఖాయమని, ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే దీని ప్రభావం ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories