విమాన టిక్కెట్లపై 14 శాతం తగ్గింపు.. వారికి మాత్రమే..?

14% discount on SpiceJet special offer air tickets for seniors
x

విమాన టిక్కెట్లపై 14 శాతం తగ్గింపు.. వారికి మాత్రమే..?

Highlights

విమాన టిక్కెట్లపై 14 శాతం తగ్గింపు.. వారికి మాత్రమే..?

SpiceJet: ప్రముఖ విమానయాన సంస్థ వాలంటైన్స్‌ డేని పురస్కరించుకొని వృద్ధులకు ప్రత్యేక ఆఫర్‌ని ప్రకటించింది. టికెట్‌ ధరలో ఏకంగా 14 శాతం తగ్గించింది. ఇది కేవలం వృద్ధులకి మాత్రమే వర్తిస్తుంది. ఇందుకోసం సీనియర్ సిటిజన్‌లు ఒరిజినల్ ఫోటో ID ప్రూఫ్‌ని తీసుకెళ్లాలి. స్పైస్‌జెట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ఈ సమాచారం తెలియజేసింది. కంపెనీ ప్రకారం మీరు స్పైస్‌జెట్ వెబ్‌సైట్ spicejet.com ని సందర్శించడం ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు. ఇది కాకుండా, మీరు స్పైస్‌జెట్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం కంపెనీ వెబ్‌సైట్‌ని సందర్శిస్తే సరిపోతుంది.

ఇదిలా ఉంటే విమాన టిక్కెట్లరద్దు ఛార్జీలపై పార్లమెంట్‌లో రచ్చరచ్చ జరుగుతోంది. ప్రైవేట్‌ సంస్థలు ఈ ఛార్జీలను ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. దీంతో విమాన టిక్కెట్ల రద్దు కోసం అన్ని విమానయాన సంస్థలు ఏకరీతి ఛార్జీలు విధించే విధానాన్ని పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. రవాణా, పర్యాటకం, సాంస్కృతిక శాఖపై పార్లమెంటు స్టాండింగ్ కమిటీ రాజ్యసభలో సమర్పించారు. కమిటీ ప్రకారం విమాన టిక్కెట్ల రద్దు ఫీజు రేట్లను హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉంది. టికెట్ రద్దు చేసుకున్న సందర్భంలో ప్రయాణికుల నుంచి వసూలు చేసే రుసుముపై పరిమితిని విధించాలి.

అయితే మంత్రిత్వ శాఖ సమాధానంపై ఆందోళన వ్యక్తం చేసిన పార్లమెంటరీ కమిటీ, టిక్కెట్ల రద్దు రుసుము ప్రభుత్వ నియంత్రణలో ఉండదని అందుకే విమానయాన సంస్థలు విధించే విమాన టిక్కెట్ రద్దు ఛార్జీలు రకరకాలుగా ఉంటాయని పేర్కొంది. అయితే విమానాలు రద్దు లేదా ఆలస్యం అయినప్పుడు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడానికి అన్ని విమానయాన సంస్థలు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రశంసించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories