Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

14 days judicial custody for CM Kejriwal
x

Arvind Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

Highlights

Arvind Kejriwal: మూడు రోజుల రిమాండ్‌ ముగియడంతో .. మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. ఇటీవల ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో తీహార్ జైలు నుంచి అర్వింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన సీబీఐ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ విధించింది. ఇవాళ్టితో మూడు రోజుల సీబీఐ రిమాండ్‌ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు. విచారణ కోసం కేజ్రీవాల్‌ను రెండు వారాల జ్యుడీషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.

దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. జూలై 12 వరకు కేజ్రీ రిమాండ్‌ కొనసాగనుంది. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలోనే తీహార్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో నాలుగు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్‌ చేసింది. కేసుకు సంబంధించిన పలు వివరాలు రాబడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories