Corona Cases in India: దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు
Corona Cases in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది.
Corona Cases in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 2,85,74,350కి చేరింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 1,32,364 కేసులు నమోదు కాగా, 2,713 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,07,071 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
వీరిలో ఇప్పటి వరకు 3,40,702 మంది మరణించగా.. ఇప్పటివరకు 2.65కోట్ల మంది కోలుకున్నారు. దేశంలో 92.79 శాతం కరోనా రోగుల రికవరీ రేటు. దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 6.02 శాతం. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.18 శాతం. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల సంఖ్య 20,75,428. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 28,75,286 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire