హెలికాప్టర్‌లోని 14 మందిలో 13 మంది మృతి.. బిపిన్‌ రావత్‌కు అత్యవసర చికిత్స..

13 of the 14 Personnel Involved in the Military Chopper Crash in Tamil Nadu have Been Confirmed Dead
x

హెలికాప్టర్‌లోని 14 మందిలో 13 మంది మృతి.. బిపిన్‌ రావత్‌కు అత్యవసర చికిత్స..

Highlights

Bipin Rawat Chopper Crash: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 13 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు.

Bipin Rawat Chopper Crash: తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో 13 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ హెలికాప్టర్‌లో ఉన్న సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ పరిస్థితిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ప్రమాద సమయంలో ఈ హెలికాప్టర్‌లో రావత్‌, ఆయన సతీమణి సహా మొత్తం 14 మంది ఉన్నారు.

మృతుల్లో బిపిన్ రావత్ సతీమణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిపిన్ రావత్ పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బిపిన్ రావత్‌కు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత బిపిన్‌ రావత్‌ ప్రాణాలతోనే ఉన్నారు. ఆయనకు ముగ్గురు డాక్టర్లు అత్యవరస చికిత్సను అందిస్తున్నారు. ఆర్మీ అధికారులు చికిత్స వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories