పెదనాన్నతో ప్రభాస్..అదరగొట్టిన అరుదైన పిక్!

Krishanam Raju and Prabhas in Radhe Shyam Movie
x

రాధేశ్యామ్ సినిమాలో కృష్ణంరాజు-ప్రభాస్ (ఫోటో:కృష్ణంరాజు ట్వీట్)

Highlights

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ గా తెలుగు సినీ తెరపై ఎవర గ్రీన్....

పాన్ ఇండియా హీరో ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ గా తెలుగు సినీ తెరపై ఎవర గ్రీన్. వీరిద్దరూ కలిసిన విశేషం ఏదైనా తెలిస్తే హన్స్ కు పండగే. కృష్ణంరాజు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన ప్రభాస్.. ఇప్పుడు తెలుగులోనే కాకుండా జాతీయస్థాయి లోనూ టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. బాహుబలి సినిమా తరువాత అన్నీ వరుసపెట్టి బహుభాషా చిత్రాల్లో నటిస్తూ తాను పాన్ ఇండియా హీరో అని నిరూపించుకుంటున్నారు ప్రభాస్.

ప్రభాస్-కృష్ణంరాజు కలసి ఇప్పటివరకూ రెండు సినిమాలు చేశారు. బిల్లా..రెబల్ అ రెండు సినిమాలు. ఆ రెండూ అనుకున్నంత విజయం సాధించలేకపోయాయి. అయితే, కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి అభిమానులకు మాత్రం మంచి అనుభూతిని పంచారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రాధే శ్యాం సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్ప్స్ విడుదల చేశారు. జూలై 30 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మూడోసారి కలిసి నటిస్తున్న రెబల్ స్టార్-యాంగ్ రెబల్ స్టార్ కాంబినేషన్ ను చూడాలనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

ఇదిలా ఉంటె.. రెబల్ స్టార్ కృష్ణంరాజు ఒక అరుదైన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేశారు. ప్రభాస్ తో కలిసి కృష్ణంరాజు ఉన్న ఫోటో అది. రాధే శ్యాం షూటింగ్ సమయంలో ఈ ఫోటో తీసినట్టు కృష్ణంరాజు పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రభాస్ తో కలిసి 70 వ దశకాన్ని గుర్తుచేసుకుంటున్నట్టు ఉంది..జూలై 30 న రాధేశ్యాం తో ఆరోజులకు వెల్లిపోదాం అంటూ కామెంట్ పెట్టారు. దీంతో ఈ పిక్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకూ కృష్ణంరాజు, ప్రభాస్ ఇద్దరూ కలిసి ఇటువంటి ఫోటో రాలేదు. అదరగొట్టే యూత్ ఫుల్ లుక్ లో ప్రభాస్ కనిపిస్తుంటే.. జీన్ ఫ్యాంట్ టీ షర్ట్ లతో కృష్ణంరాజు ప్రభాస్ కి ధీటుగా యాంగ్ స్టార్ లా కనిపిస్తున్నారు ఈ పిక్ లో. మొత్తమ్మీద అరుదైన ఈ ఫోటో ట్వీట్ చేయడం ద్వారా ప్రభాస్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చారు కృష్ణంరాజు.




Show Full Article
Print Article
Next Story
More Stories