రీమేక్ రూమర్ల లో నిజం లేదట

రీమేక్ రూమర్ల లో నిజం లేదట
x
Highlights

తమిళంలో మాధవన్ మరియు విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన 'విక్రమ్ వేద' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా...

తమిళంలో మాధవన్ మరియు విజయ్ సేతుపతి ముఖ్యపాత్రల్లో నటించిన 'విక్రమ్ వేద' సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం 'బాహుబలి' కి ధీటుగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా తెలుగు రీమేక్ కి సంబంధించి చాలా పుకార్లు బయటకు వచ్చాయి. తాజాగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ మరియు రాజశేఖర్ నటించనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తాజాగా ఒరిజినల్ వెర్షన్ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ వారు స్వయంగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తూ సినిమా రీమేక్ పై క్లారిటీ ఇచ్చారు.

'విక్రమ్ వేద' తెలుగు రీమేక్ హక్కులను తాము ఇంకా ఎవరికీ ఇవ్వలేదని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలయ్య రాజశేఖర్ కాంబోలో సినిమా ఉండదని తేలిపోయింది. నిజానికి తమిళంలో హిట్ క్లాసిక్ హిట్ సినిమాలలో ఇది కూడా ఒకటి. మాధవన్, విజయ్ సేతుపతి ల అద్భుతమైన పర్ఫామెన్స్ ని మ్యాచ్ చేసే ఆర్టిస్టులను తీసుకురావడం అంత సులువైన విషయం కాదు. ఈ సినిమాను రీమేక్ చేయడం అంటే రిస్క్ అనే చెప్పుకోవాలి. అందుకే ఈ సినిమాను వెంకటేష్, రానా లు ఈ సినిమా రీమేక్ చేయాలని ఆలోచన వచ్చినప్పటికీ ఈ కారణంతోనే వదులుకున్నారు. కన్నడ రీమేక్ కూడా అందుకే అటకెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories