Rajamouli: రాజమౌళి, మహేష్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది అప్పటి నుంచే.. ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి, మహేహ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.
Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి, మహేహ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ట్రిపులార్ చిత్రంతో ప్రపంచం దృష్టిని తనవైపు ఆకర్షించిన రాజమౌళి ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎలాంటి వండర్ క్రియేట్ చేయనున్నాడని అందరి దృష్టి పడింది. ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కాని ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి రాజమౌళి ఏం చేయనున్నాడన్న క్యూరియాసిటీ అందరిలోనూ నెలకొంది.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అధికారిక ప్రకటన కూడా చేయాలేదు. అడపాదడపా మహేష్ బాబు లాంగ్ హెయిర్‌లో ఉన్న కొత్త లుక్‌లో కనిపించడం తప్ప ఈ సినిమా టైటిల్‌ను కూడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇక సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే తాజాగా రాజమౌళి తండ్ర, రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అందరూ అనుకుంటున్నట్లుగానే జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కథ రాయడానికే దాదాపు రెండేళ్లు పట్టిందని, అద్భుతమైన కంటెంట్ తో సినిమా రాబోతున్నదని పేర్కొన్నారు.
దీంతో విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో సినీ లవర్స్‌లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను పాన్ వరల్డ్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలిసిందే. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు హాలీవుడ్ నటులు కనిపించనున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire