ఏంటి విజయ్ దేవరకొండ హీరోయిన్ కి అప్పుడే పెళ్లి అయిపోయిందా?

ఏంటి విజయ్ దేవరకొండ హీరోయిన్ కి అప్పుడే పెళ్లి అయిపోయిందా?
x
Aishwarya Rajesh, Vijay devarakonda
Highlights

యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఐశ్వర్యా రాజేష్ తమిళ్ లో ధనుష్, విక్రమ్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో

యాంకర్ గా తన జీవితాన్ని ప్రారంభించిన ఐశ్వర్యా రాజేష్ తమిళ్ లో ధనుష్, విక్రమ్ సరసన నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో పరిచయం అయి తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటించింది. ఈ సినిమాలో సువర్ణ అనే పాత్రలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ భామ. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విజయ్, ఐశ్వర్య లవ్ ట్రాక్ కి మంచి మార్కులే పడ్డాయి.

అయితే ఇప్పుడు ఈ భామకి పెళ్లి అయిందా అని నెటిజన్లు అభిప్రయపడుతున్నారు.. ఎందుకంటే తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో తన పాపిటిపై కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. భారతీయ హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లైనవారే పాపిట పై కుంకుమ పెట్టుకోవడం ఓ ఆచారంగా వస్తోంది. ఈ నేపధ్యంలో నెటిజన్లు ఐశ్వర్యా రాజేష్ ని పెళ్లి చేసుకున్నవా అని కామెంట్స్ పెడుతూ వచ్చారు. ఈ నేపధ్యంలో అలాంటిది ఏమీ లేదని మరుసటి రోజు మరో ఫొటో పోస్ట్ చేస్తూ.. 'సింగిల్ అండ్ హ్యాపీ' అని క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం ఐశ్వర్య తెలుగులో నాని హీరోగా నటిస్తున్న 'టక్ జగదీశ్' లో హీరోయిన్ గా నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రితూ వర్మ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శేరావేగంగా జరుపుకుంటుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

View this post on Instagram

#divinevibes ...

A post shared by Aishwarya Rajessh (@aishwaryarajessh) on


Show Full Article
Print Article
More On
Next Story
More Stories