ప్రధాని నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్‌ పాట

With This Song Lata Mangeshkar Broke Jawaharlal Nehru to Tears
x

ప్రధాని నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన లతా మంగేష్కర్‌ పాట

Highlights

Nehru Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Nehru Lata Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కన్నుమూశారు. ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. లతా మంగేష్కర్ మధుర గాత్రానికి ముగ్ధులు కానీ ప్రముఖులు అంటూ లేరు. 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి ముందు లతా మంగేష్కర్ పాడిన పాటని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. 1963, జనవరి 27న లతా మంగేష్కర్ ఢిల్లీ లోని రాంలీలా మైదానంలో నెహ్రూ సమక్షంలో 'యే మేరే వ‌త‌న్ కే లోగో' అనే దేశభక్తి పాటని పాడారు. ఈ గీతాలాపన తర్వాత దేశ ప్రధాని నెహ్రూ కన్నీరు ఆపుకోలేకపోయారు. అనంతరం ఆమెను వ్యక్తిగతంగా కలిసి 'మీరు నాతో కంటతడి పెట్టించారు' అని చెప్పారు. లతా తన గానంతో దేశానికి అందించిన అద్భుతమైన కానుకగా ఈ పాట నిలిచింది.

ఈ సాంగ్‌ను రాసింది క‌వి ప్ర‌దీప్‌. ఈ పాట‌ను రాయ‌డానికి దారితీసిన ప‌రిస్థితుల్ని ఓ సంద‌ర్భంలో క‌వి ప్ర‌దీప్ వివ‌రించారు. ముంబైలోని మ‌హిమ బీచ్‌లో న‌డుస్తున్న స‌మ‌యంలో త‌న‌కు ఆ ఆలోచ‌న వచ్చినట్లు అత‌ను చెప్పాడు. సిగ‌రేట్ డ‌బ్బ‌లో ఉండే అల్యూమీనియం ఫాయిల్‌పై తాను తొలిసారి యే మేరే వ‌త‌న్ కే లోగో లైన్స్ రాసిన‌ట్లు చెప్పాడు. నిజానికి ఈ పాట కోసం తొలుత ఆశా భోంస్లేను కూడా సెలెక్ట్ చేశారు. కానీ చివ‌ర‌లో అనూహ్య మ‌లుపుల త‌ర్వాత ల‌తా మంగేష్క‌ర్ ఈ పాట‌కు ఫిక్స్ అయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories