Allu Arjun: 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు వెళ్తున్నాను.. ఎప్పుడూ ఇలా జరగలేదు..

Will Abide by Law Says Allu Arjun
x

Allu Arjun: 20 ఏళ్లుగా సినిమాలు చూసేందుకు వెళ్తున్నాను.. ఎప్పుడూ ఇలా జరగలేదు..

Highlights

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై జైలుకెళ్లిన అల్లు అర్జున్.. శనివారం ఉదయం విడుదలయ్యారు.

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్టై జైలుకెళ్లిన అల్లు అర్జున్.. శనివారం ఉదయం విడుదలయ్యారు. అనంతరం జుబ్లీహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్‌కు కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. బన్నీ తన కుమారుడు, కుమార్తెను ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. అతని భార్య స్నేహా బన్నీని ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు.

తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని. చట్టానికి కట్టుబడి ఉంటానన్నారు. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపిన బన్ని.. తాను సినిమా చూసేందుకు వెళ్లిన సమయంలో అనుకోకుండా ఘటన జరిగిందన్నారు. 20 ఏళ్ళుగా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తున్నానని ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories