డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని క్షమాపణలు కోరిన హీరోయిన్

డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని క్షమాపణలు కోరిన హీరోయిన్
x
Highlights

సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ లో సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు వేస్తారు కానీ డబ్బింగ్ విభాగంలో సినిమా కోసం తమ గొంతును అరువిచ్చిన వారిని...

సినిమా అయిపోయిన తర్వాత టైటిల్స్ లో సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి పేరు వేస్తారు కానీ డబ్బింగ్ విభాగంలో సినిమా కోసం తమ గొంతును అరువిచ్చిన వారిని మాత్రం కొందరు మర్చిపోతుంటారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 'ఆయోగ్య' సినిమాలో రాశి కన్నా పాత్రకు డబ్బింగ్ చెప్పిన రవినా అనే యువతి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తం చేసింది. 'టెంపర్' సినిమా రీమేక్ గా విడుదలైన 'ఆయోగ్య' సినిమాలో పనిచేసిన డ్రైవర్లు, పెయింటర్లు, సౌండ్ ఇంజినీర్లు అందరి పేర్లు వేశారు కానీ డబ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు మాత్రం వేయలేదని అన్నారు.

ఈ నేపథ్యంలో స్పందించిన రాశిఖన్నా రవీనాకు క్షమాపణలు చెబుతూ ఒక ట్వీట్ చేశారు. "నన్ను క్షమించు రవీనా. నీ అందమైన స్వరం నా పాత్రను మరింత మెరుగుపరిచింది. ధన్యవాదాలు" అంటూ రవీనా ట్వీట్‌కు రాశీ బదులిచ్చింది. దీనికి రియాక్ట్ అయిన రవీనా రాశి తప్పు లేదు అని చెప్పుకొచ్చింది. "థాంక్యూ రాశీ. సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది నీ తప్పు కాదు. నీకు డబ్బింగ్‌ చెప్పినందుకు సంతోషంగా ఉంది" అని ట్వీట్‌ చేశారు రవీనా.

Show Full Article
Print Article
Next Story
More Stories