Mohini Dey: ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన రోజే తన భర్తతో డైవోర్స్ తీసుకున్న మోహినీ డే ఎవరు?

Mohini Dey
x

Mohini Dey

Highlights

Mohini Dey: మోహిని డే..ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన రోజే తన భర్తతో విడాకులు తీసుకున్నారు. దీంతో మోహిని డే వార్తల్లో నిలిచారు.

Mohini Dey: మోహిని డే..ఏఆర్ రెహమాన్ విడాకులు ప్రకటించిన రోజే తన భర్తతో విడాకులు తీసుకున్నారు. దీంతో మోహిని డే వార్తల్లో నిలిచారు. అసలు ఈ మోహినీ డే ఎవరు..ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే తాను ఎందుకు డైవోర్స్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది? ఏఆర్ రెహమాన్ కు, మోహిని డేకు మధ్య ఉన్న బంధం ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మోహిని డే..11ఏళ్ల వయస్సులోనే బాస్ గిటారిస్టుగా మంచి పేరు సంపాదించుకుంది. మోహినికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు తండ్రి సుజయ్ డే బాస్ గిటార్ తన చేతికందించాడు. అలా మూడేళ్ల వయస్సు నుంచే బాస్ గిటార్ తో మోహిని ఫ్రెండ్షిప్ షురూ అయ్యింది. 9ఏళ్ల వయస్సులో తొలిసారిగా సంగీత రంగంలోకి అడుగుపెట్టింది. మోహిని జులై 20, 1996న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 28ఏళ్లు. కొన్నేళ్లుగా ఆమె జాకీర్ హుస్సేన్, శివమణి, విల్లో స్మిత్, స్టీవ్ వాయ్ తోపాటు పలువురు ఇంటర్నేషనల్ కళాకారులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది.

జాజ్ ఫ్యూజన్ గిటారిస్టుగా మ్యూజిక జర్నీ ప్రారంభించిన మోహిని డే తండ్రి సంజయ్ డే ఆ తర్వాత జాజ్ కు దూరమై కుటుంబ పోషణ కోసం కోల్ కతా నుంచి ముంబైకి చేరుకున్నారు. సెషన్స్ ఆర్టిస్టగా మారిన సంజయ్...మోహినికి తండ్రి సంజయ్ తొలి మ్యూజిక్ టీచర్. తండ్రి సహకారంతో చిన్న వయస్సులోనే పేరున్న పెద్ద కళాకారులతో కలిసి మోహిని సంగీత కచేరీలు చేసింది.

13ఏళ్ల వయసులో ఫేమస్ పృథ్వీ థియేటర్ నుంచి మోహినికి ఆహ్వానం వచ్చింది. మ్యూజిక్ ప్రాక్టిస్ చేస్తున్న నా దగ్గరకు వచ్చి రంజిత్ అంకుల్ నుంచి ఆహ్వానం వచ్చింది. బ్యాగ్ సర్దుకో అంటూ చెప్పారు. పృథ్వీ థియేటర్ కు వెళ్లాక అక్కడ జాకీర్ హుస్సేన్, ఫిల్మ్ స్టార్స్ ను చూశాను. రంజిత్ అంకుల్ నన్ను జాకీర్ అంకుల్ కు పరిచయం చేసిన తర్వాత స్టేజీ మీద బాస్ గిటార్ ప్లే చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది అంటూ తన మ్యూజికల్ జ్నాపకాలను పంచుకుంది మోహిని.

తండ్రి బాస్ గిటారిస్ట్ కావడంతో ఎంత బిజీగా ఉన్న కూతురికి మాత్రం పాఠాలు నేర్పించేందుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవాడు. విక్టర్ వుటెన్ నుంచి మార్కస్ మిల్లర్ వరకు ఎంతో మంది గిటారిస్టుల ప్రభావం మోహినిపై ఉండటమే కాదు..ఒకే స్టైల్ కు పరిమితం కాకుండా ఎన్నో రకాల స్టైల్స్ ను ప్లే చేయడంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది మోహిని డే.

అయితే మోహిని డేకు సొంతంగా మ్యూజిక్ స్కూల్ ప్రారంభించాలనే కల ఉందట. జంతుసంరక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లో సైతం పాల్గొనాలని..వోన్ మ్యూజిక్ షోతో ప్రేక్షకులకు నచ్చే మ్యూజిక్ అందించాలని ప్లాన్ చేస్తుందట.

Show Full Article
Print Article
Next Story
More Stories