Rajamouli And Allu Arjun: బన్నీతో జక్కన్న క్రేజీ కాంబో ఎప్పుడు..?

Rajamouli And Allu Arjun
x

Rajamouli And Allu Arjun: బన్నీతో జక్కన్న క్రేజీ కాంబో ఎప్పుడు..?

Highlights

Rajamouli And Allu Arjun Movie: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయారు. ఈ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Rajamouli And Allu Arjun Movie: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అయిపోయారు. ఈ సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇక దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా రాజమౌళి గుర్తింపు సొంతం చేసుకున్నారు. సినిమా సినిమాకి అతని రేంజ్ పెరిగిపోతోంది. మరి అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుంది..?. అలాంటి క్రేజీ కాంబినేషన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ ప్రియులు.

డిసెంబర్ 5న పుష్ప2 గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్‌లో భారీ స్థాయిలో వైల్డ్ ఫైర్ జాతర పేరుతో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ నార్త్ లో నీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా అక్కడ సినిమాను ప్రమోట్ చేయ్ అని పుష్ప1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ కు చెప్పానన్నారు. మూడేళ్ల తర్వాత పుష్ప2కు ప్రపంచ వ్యాప్తంగా ఎటువంటి ప్రమోషన్స్ అవసరం లేనంతగా క్రేజ్ ఉందంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా జక్కన్న, బన్నీ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం రాజమౌళి మూవీ తీస్తున్నారు. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌‌లో మూవీ కథని చెప్పబోతున్నారు రాజమౌళి. ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్‌తో ఆయన సినిమాలు చేశారు. అలాగే రవితేజ, నాని, నితిన్, సునీల్ తో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మగధీర సినిమా తర్వాత బన్నీతో రాజమౌళి సినిమా చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ ఎందుకో అది సెట్ కాలేదు. ఆ తర్వాత అజిత్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రం చేయాలని అనుకున్నారట. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చకుండానే ఆగిపోయింది. ఆ ఆలోచన స్ఫూర్తితోనే ఆర్ఆర్ఆర్ సినిమాని బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం చేశారని ఇండస్ట్రీలో టాక్.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా తీసే పనిలో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమ కంప్లీట్ అవ్వడానికి మూడేళ్లు సమయం పట్టొచ్చు. ఈ లోపు అల్లు అర్జున్ తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇవి పూర్తైన తర్వాత రాజమౌళి బన్నీ కాంబినేషన్‌లో సినిమా ఏమైనా స్టార్ట్ అవుతుందా అనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories