OTT: రూ. 1.5 కోట్ల బడ్జెట్.. రూ. 6 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోయిన్ కెరీర్‌ని నిలబెట్టిన యాక్షన్ థ్రిల్లర్‌..!

Watch Rekha Best Action Thriller Movie Khoon Bhari Maang in OTT
x

OTT: రూ. 1.5 కోట్ల బడ్జెట్.. రూ. 6 కోట్ల కలెక్షన్స్.. స్టార్ హీరోయిన్ కెరీర్‌ని నిలబెట్టిన యాక్షన్ థ్రిల్లర్‌..!

Highlights

Action Thriller Movie: కథనంతోనే గూస్‌బంప్స్ అందించే ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది.

Action Thriller Movie: కథనంతోనే గూస్‌బంప్స్ అందించే ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించింది. యాక్షన్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలో ప్రతీ సీన్ థ్రిల్‌ని కలిగిస్తుంది. అలాగే, ఈ సినిమాలో లీడ్ హీరోయిన్ కెరీర్‌ను మళ్లీ అగ్రస్థానానికి తీసుకువచ్చింది. ఆ సినిమా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1988లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఐదవ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా హీరోయిన్ రేఖ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకువచ్చింది. ఈ సినిమా పేరు 'ఖూన్ భారీ మాంగ్'.

ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 1988లో విడుదలైంది. రేఖతో పాటు, ఈ చిత్రంలో కబీర్ బేడీ, సోను వాలియా, ఖాదర్ ఖాన్, శతృఘ్న సిన్హా, సత్యజిత్ పూరి కూడా నటించారు. ఈ చిత్రానికి రాకేష్ రోషన్ దర్శకత్వం వహించారు. కాగా కథను మోహన్ కౌల్, రవి కపూర్ రాశారు.

ఈ సినిమా కథ వితంతువు ఆర్తి చుట్టూ తిరుగుతుంది. భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈ సినిమాలో కోట్ల ఆస్తికి యజమాని ఆర్తి పాత్రలో రేఖ నటించింది. సంజయ్ వర్మ పాత్రను కబీర్ బేడీ పోషించారు.

కబీర్ బేడీ సోనూ వాలియాతో కలిసి ఆర్తిని దారుణంగా చంపేస్తాడు. ఆర్తిని పడవపై తీసుకెళ్లి నదిలోకి నెట్టేస్తాడు. ఆ తర్వాత ఆమె మొసలికి బలి అవుతుంది. ఆర్తికి జరిగిన ఈ యాక్సిడెంట్ సీన్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే అది చూసి చాలా మందికి మతిపోతుంది.

ఈ ప్రమాదానికి ముందు ఆర్తి అంత అందంగా ఉండదు. కానీ, ఆస్తి కారణాల వల్ల సంజయ్ ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇక్కడ సంజయ్, అతని స్నేహితురాలు ఆర్తితోపాటు పిల్లలు చనిపోయారని ఊహిస్తారు. మరోవైపు, ఒక గ్రామంలోని ప్రజలు నది ఒడ్డున ఆర్తిని కనుగొంటారు. ఆమెకు చికిత్స చేస్తారు. ఆ తర్వాత ఆర్తి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని పూర్తిగా మారిపోతుంది.

ఆ తర్వాత ఆమె సంజయ్‌పై ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తుంది. ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.1.5 కోట్లు. అయితే విడుదలైన వెంటనే రూ.6 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాకు గానూ రేఖ ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకుంది. ఇది మాత్రమే కాదు, రేఖ కెరీర్‌కు మళ్లీ ప్రాణం పోసిందనే చెప్పాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories