Horror Movie: ప్రతీక్షణం ఓ ట్విస్ట్.. పీక్స్‌కు చేరిన ఉత్కంఠ.. ఒంటిరిగా చూస్తే వెన్నులో దడ పుట్టాల్సిందే భయ్యో..!

Watch Horror Movie Evil Lurks On Amazon Prime Video
x

Horror Movie: ప్రతీక్షణం ఓ ట్విస్ట్.. పీక్స్‌కు చేరిన ఉత్కంఠ.. ఒంటిరిగా చూస్తే వెన్నులో దడ పుట్టాల్సిందే భయ్యో..!

Highlights

Horror Movie: హారర్ సినిమాలను చాలామంది ఇష్టపడి చూస్తుంటారు. అన్ని భాషల్లో ఈ సినిమాలకు ఫ్యాన్స్ ఉంటారు.

Horror Movie: హారర్ సినిమాలను చాలామంది ఇష్టపడి చూస్తుంటారు. అన్ని భాషల్లో ఈ సినిమాలకు ఫ్యాన్స్ ఉంటారు. ఇక తెలుగులో ఇలాంటి సినిమాలకు భలే క్రేజ్ ఉంది. చూడ్డానికి ఈ సినిమాలు చాలా భయంకరంగా ఉంటాయి. కానీ, చాలామంది ఈ హార్రర్ సినిమాలను భయపడుతూనే ఎంజాయ్ చేస్తుంటారు. ఓటీటీలు పెరిగిన తర్వాత ఇలాంటి సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. ఓటీటీలోకి వచ్చిన ఏ హర్రర్ సినిమాను ఫ్యాన్స్ వదలడం లేదు. తాజాగా మరో హార్రర్ సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఆ సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుంది. ఓ మారుమూల పల్లెటూరిలో పెడ్రో, జైన్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అదే ఊరిలో వ్యవసాయం చూస్తూ జీవిస్తుంటారు. ఇదే క్రమంలో ఆ ఊరిలో దెయ్యం ఉందనే విషయాన్ని గమనిస్తారు. ఈ విషయం బయటకు రాకముందే నాశనం చేయాలని భావిస్తారు. దెయ్యం పట్టిన బాడీని కనుగొని, దానిని నాశనం చేసేందుకు స్కెచ్ వేస్తారు.

అయితే, వీరిద్దరు ఊహించని ప్రమాదంలో ఇరుక్కుంటారు. సదరు దెయ్యం ఈ ఇద్దరిపై దాడికి సిద్ధమవుతుంది. దీంతో ఇద్దరు అన్నదమ్ములు ఏం అయ్యారు.? దెయ్యాన్ని నాశనం చేశారా? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్పానిష్ హారర్ మూవీ ‘వెన్ ఈవిల్ లర్క్స్’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అయితే, ఈ సినిమాను తెలుగులో డబ్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఇజాక్వెల్ రోడ్రిక్స్, డిమియన్ సోలోమోన్ కీలక పాత్రలు పోషించారు. డెమియన్ రుగ్మా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories