OTT: ఒక గ్రామం, డజన్ల కొద్దీ హత్యలు.. ప్రతీ ఎపిసోడ్‌లో షాకిచ్చే ట్విస్ట్‌లు.. మొదలెడితే సిరీస్ పూర్తవ్వాల్సిందే..!

Watch 2024 Best Murder Mystery Web Series Manvat Murders on OTT Ashutosh Gowariker and Sonali Kulkarni
x

ఒక గ్రామం, డజన్ల కొద్దీ హత్యలు.. ప్రతీ ఎపిసోడ్‌లో షాకిచ్చే ట్విస్ట్‌లు.. మొదలెడితే సిరీస్ పూర్తవ్వాల్సిందే..!

Highlights

Best Murder Mystery Series in OTT: ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వచ్చిన తర్వాత, ప్రేక్షకులకు అన్ని రకాల కంటెంట్స్‌పై ఆసక్తి పెరిగింది.

Best Murder Mystery Series in OTT: ఓటీటీ ప్లాట్‌ఫారమ్ వచ్చిన తర్వాత, ప్రేక్షకులకు అన్ని రకాల కంటెంట్స్‌పై ఆసక్తి పెరిగింది. మీరు కూడా అలాంటి కంటెంట్ కోసం చూస్తున్నారా.. అందుకే మీ కోసం అలాంటి క్రైమ్ మర్డర్ మిస్టరీ, థ్రిల్లర్ సిరీస్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ సిరీస్ ముందు సౌత్, బాలీవుడ్‌లోని మర్డర్ మిస్టరీలు తేలిపోతాయి. ఈ సినిమా కథ పరంగా అజయ్ దేవగన్ నటించిన 'దృశ్యం', 'దృశ్యం 2' చిత్రాలను కూడా వెనక్కునెట్టేసింది. ఈ సిరీస్ కథ ఒక గ్రామంలో జరిగే హత్యల చుట్టూ తిరుగుతుంది. ప్రతి మలుపులో ప్రేక్షకులను షాక్‌కి గురి చేస్తుంది. ఈ సిరీస్‌కి IMDbలో అద్భుతమైన రేటింగ్ కూడా వచ్చింది. ఆ సిరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఓ మర్డర్ మిస్టరీ సిరీస్. ఇందులో హంతకుడు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం. కథ ఒక హత్య కేసుతో ప్రారంభమవుతుంది. కథ ముందుకు సాగుతున్నప్పుడు, ప్రతి ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ఇది ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా చివరి ఎపిసోడ్ ప్రేక్షకుడి మైండ్‌ని షేక్ చేసేస్తుంది.

ఈ సిరీస్ పేరు 'మానవ్త్ మర్డర్స్'. ఇది ఇటీవల OTTలో విడుదలైంది. 'లగాన్', 'జోధా అక్బర్' వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన అశుతోష్ గోవారికర్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ షోలో సోనాలి కులకర్ణి, కిషోర్ కదమ్, సాయి తమంకర్, పలువురు ఆర్టిస్టులు కనిపిస్తారు. ఈ సిరీస్ ప్రేక్షకులకు విభిన్నమైన కథను అందిస్తుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన మలుపులతో కూడి ఉంటుంది. దీంతో చివరి వరకు ఈ సిరీస్‌ను చూసేలా చేస్తుంది.

ఈ సిరీస్ కథ 1970ల నాటిది. ఇది ఒక హత్యతో మొదలవుతుంది. ఇందులో మొదటి నిమిషంలో, పొలంలో పని చేస్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు దారుణంగా హత్య చేస్తారు. ఆ తరువాత, మనావత్ గ్రామంలో గత రెండేళ్లలో అరడజనుకు పైగా హత్యలు జరిగాయని, ఇందులో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనడంతో అందరూ ఆందోళన చెందుతుంటారు. అంతేకాదు ఈ విషయం పోలీసులను కూడా కలవరపెడుతుంది.

DCP రమాకాంత్ కులకర్ణి (అశుతోష్ గోవారికర్) కి హంతకుడిని కనుగొనడానికి ఒక కేసును కేటాయిస్తారు. కానీ, కేసు క్లోజ్ చేయడం అంత ఈజీ కాదని తెలుస్తుంది. గ్రామంలో మహిళల హత్యల వెనుక మంత్రతంత్రాలే ప్రధాన కారణమని రమాకాంత్‌ విచారణలో వెల్లడవుతుంది. ఈ సిరీస్‌లో 8 ఎపిసోడ్‌లు ఉన్నాయి. దాని చివరి ఎపిసోడ్‌లో ఒక షాకింగ్ ట్విస్ట్ పెట్టారు డైరెక్టర్.

ఈ సిరీస్‌లోని ప్రతి ఎపిసోడ్‌లో సస్పెన్స్ పెరుగుతుంది. ఒక్కసారి చూడటం మొదలుపెడితే చివరి వరకు చూసేస్తారు. 'మానవత్ మర్డర్స్' చిత్రానికి ఆశిష్ బెండే దర్శకత్వం వహించగా, స్క్రీన్‌ప్లే, కథ, సంభాషణలను గిరీష్ జోషి రాశారు. అశుతోష్ గోవారికర్ రూపొందించిన 2024లో వచ్చిన ఉత్తమ హత్య-మిస్టరీ సిరీస్‌లలో ఇది ఒకటి. దీన్ని OTT ప్లాట్‌ఫారమ్ Sony Livలో చూడవచ్చు. అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories