Vivek Agnihotri: 'కశ్మీర్‌ ఫైల్స్' దర్శకుడి నుంచి కొత్త సినిమా.. ఈసారి ఏ అంశంపై అంటే..?

Vivek Agnihotri: కశ్మీర్‌ ఫైల్స్ దర్శకుడి నుంచి కొత్త సినిమా.. ఈసారి ఏ అంశంపై అంటే..?
x
Highlights

The Delhi Files: ది కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

The Delhi Files: ది కశ్మీర్ ఫైల్స్ దేశ వ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2022లో వచ్చిన ఈ సినిమా దేశంలో అలజడి సృష్టించింది. కశ్మీర్‌లో జరిగిన యదార్థ సంఘటనల ఆదారంగా తెరకెక్కిన ఈ సినిమా విమర్శలతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన అగ్ని హోత్రి ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పకున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా వివేక్‌ అగ్నిహోత్రి నుంచి మరో సినిమా వస్తోంది. కశ్మీర్‌ ఫైల్స్‌ తర్వాత వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది వాక్సిన్ వార్ బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వైఫల్యాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథాంశంతో ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నాడు దర్శకుడు వివేక్‌.

ది ఢిల్లీ ఫైల్స్ పేరుతో ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ‘ది బెంగాల్‌ ఛాప్టర్‌’ అనేది ఉప‌శీర్షికతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ నిర్మించిన టాలీవుడ్ బ్యాన‌ర్ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుద‌ల తేదీని మేక‌ర్స్ ప్ర‌కటించారు. ఈ సినిమాను ఆగ‌ష్టు 15న ఇండిపెండెన్స్ కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న ప్రకటించనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. మరి కశ్మీర్‌ ఫైల్స్‌తో దేశం మొత్తాన్ని ఆకర్షించిన వివేక్‌.. ఇప్పుడు ఢిల్లీ ఫైల్స్‌తో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేయనున్నాడో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories