Vikatakavi: జీ5లో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. తెలంగాణ నేపథ్యంలో సాగే డిటెక్టివ్‌ స్టోరీ

Vikatakavi: జీ5లో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. తెలంగాణ నేపథ్యంలో సాగే డిటెక్టివ్‌ స్టోరీ
x
Highlights

Vikatakavi web series Story: ఓటీటీల విస్తృతి పెరిగిన తర్వాత ఓటీటీలకు భలే ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా డిటెక్టివ్‌, థ్రిల్లర్‌ కథాంశంతో వచ్చే వెబ్...

Vikatakavi web series Story: ఓటీటీల విస్తృతి పెరిగిన తర్వాత ఓటీటీలకు భలే ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా డిటెక్టివ్‌, థ్రిల్లర్‌ కథాంశంతో వచ్చే వెబ్ సిరీస్‌లకు ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ విభిన్న కథలతో కూడి సిరీస్‌లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఓ వినూత్న వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది.

'వికటకవి' పేరుతో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ అధికారికంగా ప్రకటించారు. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.

తెలంగాణ నేపథ్యంలో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే అని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో ఈ సిరీస్‌పై అంచనాలు పెరిగిపోయాయి. వెబ్ సిరీస్ కథనం ప్రకారం.. హైదరాబాద్ విలీనం తర్వాత నల్లమల అటవీ ప్రాంతంలోని ‘అమరగిరి’ అనే ప్రాంతాన్ని 30 ఏళ్లుగా ఓ శాపం పట్టి పీడిస్తుంటుంది. కొన్ని కార‌ణాల‌తో అమరగిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను గుర్తించ‌టానికి డిటెక్టివ్ రామకృష్ణ వెళతాడు. ఇంతకీ ఆ ప్రాంతంలో ఉన్న సమస్య ఏంటి? ఈ సమస్యను పరిష్కరించే సమయంలో అతను ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? లాంటి విషయాలను సిరీస్‌లో చూపించనున్నారు. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories