OTT: సినీ లవర్స్‌కి పండగే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సస్పెన్స్ మూవీ

vijay sethupathi latest movie Maharaja streaming in Netflix OTT
x

OTT: సినీ లవర్స్‌కి పండగే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సస్పెన్స్ మూవీ 

Highlights

OTT: సినీ లవర్స్‌కి పండగే.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న సస్పెన్స్ మూవీ

OTT: ఓటీటీ లవర్స్‌కి ఈ వీకెండ్‌కి ఒక ఇంట్రెస్టింగ్‌ సినిమా అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్ థ్రిలర్స్‌ని ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఆ సినిమా మరెదో కాదు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి నటించిన మహారాజ. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. విజయ్‌ సేతుపతి 50వ చిత్రంగా వచ్చిన ఈ సినిమా జూన్‌ 14న థియేటర్లలో సందడి చేసిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మహారాజ పేరుతో ఎన్‌వీఆర్‌ విడుదల చేసింది. కాగా ఈ చిత్రానికి నితిలన్‌ సామినాథన్‌ దర్శకత్వం వహించాడు. తమిళంలో ఈ విజయం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్‌ చెప్పింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.

థియేటర్‌లో విడుదలైన 28 రోజుల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇక కథ విషయానికొస్తే విజయ్‌ సేతుపతి ఒక సెలూన్‌ షాప్‌ నిర్వహిస్తుంటాడు.

ఓరోజు తన ఇంట్లో లక్ష్మిని దొంగిలించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఈ సమయంలో లక్ష్మీ అంటే ఏంటని అడగ్గా సేతుపతి సమాధానం చెప్పడు. లక్ష్మీ అంటే మనిషి కాదని, నగలు కాదని, డబ్బు కాదని చెబుతుంటాడు. దీంతో ఇంతకీ ఏంటా లక్ష్మీ అన్న అంశం చుట్టూ కథ తిరుగుతుంటుంది. ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతితో పాటు బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్‌, మమతా మోహన్‌ దాస్‌, నట్టీ కీలక పాత్రల్లో నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories