Master Movie Review: మాస్టర్‌ మూవీ రివ్యూ

Master Movie Review: మాస్టర్‌ మూవీ రివ్యూ
x

మాస్టర్‌ మూవీ

Highlights

కోలీవుడ్‌ స్టార్‌ హీరో 'ఇళయదళపతి'విజయ్ గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు.

కోలీవుడ్‌ స్టార్‌ హీరో 'ఇళయదళపతి'విజయ్ గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను ప్రకటిస్తూ సత్తా చాటుతున్నాడు. తమిళ హీరో అయినప్పటికీ విజయ్‌కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన తన క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ప్రతి సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తూ టాలీవుడ్‌లోమంచి మార్కెటింగ్‌ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో మాస్టర్‌ అనే సినిమాతో సంక్రాంతి సందర్భంగా బుధవారం ప్రేక్షకుల మందుకు వచ్చాడు. విజయ్‌తో పాటు'మక్కల్ సెల్వన్'విజయ్ సేతుపతి కూడా నటిస్తుండటం ఫ్యాన్స్‌లో ఎక్స్‌పెక్టెషన్స్‌ పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ బుధవారం విజయ్ మాస్టర్ ఫ్యాన్స్‌ అంచాల నడుమ రిలీజ్ అయింది. విజయ్‌ తాజా చిత్రం విజయం సాధించిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.

కథ

భవాని(విజయ్‌ సేతుపతి) వరంగల్‌లో ఓ పేరు మోసిన రౌడీ. తాను ఎలా ఉంటాడో జనాలకు ఎక్కువ తెలియదు కానీ.. తన భయమేంటో జిల్లా మొత్తానికి తెలుసు. లారీలలో మత్తు పదార్థాలు సరఫరా చేస్తూ, రాజకీయంగా ఎదగాలని చూస్తాడు. అందులో భాగంగా మొదటగా లారీ యూనియన్‌ అధ్యక్షుడు కావాలనుకుంటాడు. పోటీలో ఉన్న ప్రత్యర్థులను హతం చేసి ఏకగ్రీవంగా లారీ యూనియన్‌ అధ్యక్షుడు కావాలని ప్లాన్‌ వేస్తాడు.

ఇదిలా ఉంటే జేడీ(విజయ్‌) ఎలాంటి నియమ నిబంధనలు లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌. మద్యానికి బానిసై తోటి సిబ్బందికి తలనొప్పిగా మారుతాడు. అతనంటే తోటి సిబ్బందికి ఇష్టం లేకపోయినా... విద్యార్థులకు మాత్రం ఆయనే హీరో. ఆయన కోసం ఏ పని చేయడానికైనా విద్యార్థులు సిద్దంగా ఉంటారు. జేడీ సర్‌ లేనిదే కాలేజీలో ఎలాంటి కార్యక్రమాలు జరనివ్వరు. అలాంటి జేడీ కొన్ని కారణాల వల్ల వరంగల్‌లోని బాల నేరస్థులకు పాఠాలు బోదించాల్సి వస్తుంది. అయిష్టంగానే అక్కడి వెళ్లిన జేడీకీ.. ఆదిలోని అనుకోని ఒక సంఘటన ఎదురవుతుంది. ఈక్రమంలో జేడీకి భవానికి పరోక్షంగా పోరు జరుగుంది. అసలు బాల నేరస్థులకు, భవానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తాగుడు మానేసి, పిల్లలను రక్షించేందుకు ఎందుకు పూనుకున్నాడు? భవాని కోటను జేడీ కూల్చుతాడా లేదా అనేది ఈ సినిమా కథ.

ఎవరు ఎలా చేశారంటే..

నటనలో ఇద్దరు తమకు తామే సాటీ అన్నట్లుగా పోటీపడ్డారు. ఎలాంటి రూల్స్ లేని ఓ కాలేజీ ప్రొఫెసర్‌గా విజయ్‌ ఒదిగి పోయాడు. స్టైల్‌, యాక్షన్‌ లో తనకు సాటి లేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇక విజయ్‌ సేతుపతి ఎప్పటిలానే క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయిపోయాడు. సినిమా చూసిన వారు భవాని పాత్రను మర్చిపోరు. విలన్‌ పాత్రలో అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయాడు విజయ్ సేతుపతి. చారు పాత్రలో మాళవికా మోహన్‌ ఆకట్టుకుంది. ఆండ్రియా, శాంతను భాగ్యరాజ్‌ తమ పరిధి మేర నటించారు. అనిరుధ్ పాటలు తెలుగు ఆడియన్స్‌ ను పెద్దగా అలరించకపోయినా.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ మాత్రం అదిరిపోయింది. సత్యన్ సూర్యన్ విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్‌ పై ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపిస్తుంది.

ఖైదీ లాంటి హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో విజయ హీరోగా వస్తున్నచిత్రం కావడంతో మాస్టర్ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలిభాగం మొత్తం అసలు కథ చెప్పకుండా హీరోని, విలన్‌ని హైలెట్‌ చేయడానికి కేటాయించాడు. మత్తుకు బానిసైన ఫ్రొఫెసర్‌కు విద్యార్థులు అభిమానం ఎందుక చూపిస్తారో కారణాలు చూపించలేకపోయారు. సెకండాఫ్‌లో అసలు కథ ఏంటో చూపిస్తాడు అనుకుంటే సాగతీత సీన్లు ఇబ్బంది పెడతాయి. ఇక హీరో ప్రతి సారి వెనక్కి తిరిగి వేసే స్టెప్పులు కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చవు. హీరో, విలన్ల మధ్య జరిగే పోరాటం కూడా అంతగా రక్తి కట్టించలేకపోయాయి. హీరో, విలన్ల కలిసిన సన్నివేశాలు ఆకట్టుకోలేకపోయాయి. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా కథ సాగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉన్నాయి. ఈ సంక్రాంతికి వచ్చే తెలుగు సినిమాలు విజయం సాధిస్తే మాస్టర్ లెక్కలు తప్పే అవకాశం ఉంది.


గమనిక‌: ఇది పూర్తిగా సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే

Show Full Article
Print Article
Next Story
More Stories