Vijay Deverakonda: డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్‌ దేవరకొండకు చోటు

Vijay Deverakonda the First Tollywood Star to Feature on Daboo Ratnanis Calendar
x

Vijay Deverakonda:( Photo Instagram)

Highlights

Vijay Deverakonda: బాలీవుడ్‌ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్‌ కు చోటు

Vijay Deverakonda: కుర్రాళ్లు మనసులో అనుకునే మాటలను డైరెక్టుగా అర్జున్ రెడ్డితో పలికించేశాడు సందీప్ రెడ్డి. దీంతో బోల్డ్ అండ్ వయిలెంట్ కేరెక్టర్ అర్జున రెడ్డికి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. కోపమొస్తే కొట్టేయాలి.. అడ్డమొస్తే తిట్టేయాలి.. మూడ్ వస్తే అన్నీ చేసేయాలి అనే రేంజ్ లో ఆ కేరెక్టర్ ఉండటంతో కుర్రాళ్లకు నచ్చేసింది.. ఆ కేరెక్టర్ లో జీవించిన విజయ్ దేవరకొండ ఆ ఒక్క సినిమాతో స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆ క్రేజీ లైగర్ మరో క్రేజీ క్యాలెండర్ లో కనిపించబోతున్నాడు.

తన తొలి పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌' విడుదలకు ముందే విజయ్‌ దేవరకొండ ఉత్తరాది ప్రేక్షకులను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్‌ తారలు సైతం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ప్రముఖ ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నాని క్యాలెండర్‌లో విజయ్‌ చోటు సంపాదించాడు. సినీ ప్రముఖుల ఫొటోలతో ప్రచురితమయ్యే 'డబ్బూ రత్నాని 2021 క్యాలెండర్‌'లో విజయ్‌ మెరవబోతున్నాడు.

విజయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎంతో సమయస్ఫూర్తి కలిగిన నటుడు విజయ్‌ అంటూ రౌడీ హీరోపై డబూ ప్రశంసలు కురిపించారు. క్యాలెండర్‌ షూట్‌లో భాగంగా కండలు తిరిగిన దేహంతో బైక్‌పై కూర్చొని మాస్‌ లుక్‌లో విజయ్‌ ఫొటోలకు పోజులిచ్చాడు. ఒక ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విడుదల చేశాడు. ఈ సందర్భంగా.. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో పలు విషయాలు పంచుకున్నారు.

విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. ''నేను నటుడిని కావాలనుకోవడానికి ముందు నుంచే నాకు డబూ రత్నాని క్యాలెండర్‌ గురించి తెలుసు. ఈ క్యాలెండర్‌ను ప్రారంభించినప్పుడు నా వయసు తొమ్మిదేళ్లు. షారుఖ్‌ఖాన్‌ ఎక్కువగా ఈ క్యాలెండర్‌లో రావడాన్ని నేను చూస్తుండేవాడిని. అలా షారుఖ్‌ను ఆరాధించేవాడిని. ఆయన ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నేను కూడా ఆయనలా ఏదో ఒకరోజు క్యాలెండర్‌లో కనిపించాలనుకున్నాను. ఇప్పుడు ఆ పని పూర్తి చేశానని భావిస్తున్నాను. ఈ ఫొటోషూట్‌ చిటికెలో అయిపోయింది. రత్నానితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది' అని విజయ్‌ అన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories