Tollywood: సీనియర్ గాయకులు జి.ఆనంద్ కన్నుమూత

Tollywood: సీనియర్ గాయకులు జి.ఆనంద్ కన్నుమూత
x
Highlights

Tollywood: సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి కరోనాతో కన్నుమూశారు.

Tollywood: కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళిస్తోంది. రోజు రోజుకి ఈ మహమ్మారి భయకరంగా మారుతోంది. ఈ మహమ్మారి సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టడం లేదు. ఈ కరోనా. ఎంతో మంది లెజెండ్స్ కరోనా వల్ల కన్నుమూసి సినిమా ఇండస్ట్రీని తీరని విషాదంలోకి నెట్టారు. తాజాగా సీనియర్ గాయకుడు కరోనా తో కన్నుమూశారు. సీనియర్ గాయకుడు జి.ఆనంద్ గత రాత్రి కరోనాతో కన్నుమూశారు.ఆయన వయసు 67 సంవత్సరాలు.

ఇటీవల కరోనా బారినపడిన ఆయన ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించింది. సకాలంలో వెంటిలేటర్‌ లభించకపోవడంతో ఆనంద్‌ మృత్యువాత పడినట్లు తెలిసింది. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా తులగమ్‌ గ్రామం. తన గాత్రంతో 70లలో తెలుగు ప్రేక్షకులను అలరించారు. 'ఒక వేణువు వినిపించెను', 'దిక్కులు చూడకు రామయ్య', 'విఠలా విఠలా పాండురంగ విఠలా'వంటి అనేక పాటలు పాడారు. ప్రపంచ వ్యాప్తంగా 6,500 పైగా కచేరీలు నిర్వహించారు. 'గాంధీనగర్‌ రెండో వీధి', 'స్వాతంత్య్రానికి ఊపిరి పోయండి', 'రంగవల్లి' చిత్రాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories