Ram Laxman: బాలీవుడ్ లో విషాదం.. సీనియ‌ర్ సంగీత దర్శకుడు కన్నుమూత

Veteran music director Ram Laxman dies
x

రామలక్ష్మణ్  ఫైల్ ఫోటో 

Highlights

Ram Laxman: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది.

Ram Laxman: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ కన్నుమూశారు. బాలీవుడ్ సీనియర్ సంగీత దర్శకుడు రామ్ లక్ష్మణ్ (78 )కన్నుమూశారు. రామ్ లక్ష్మణ్ నాగ్ పూర్ లోని తన నివాసంలో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న‌ అసలు పేరు విజయ్ పాటిల్. రామ్ లక్ష్మణ్ హిందీ, మరాఠీ, భోజ్ పురి భాషల్లో 150కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు రామ్ లక్ష్మణ్. శ‌నివారం తుది శ్వాస విడిచారు.

శ్రీ ప్రొడక్షన్స్ కు ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజశ్రీ బ్యానర్ లో ఆయన అత్యధిక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. కాగా, రామ్ లక్ష్మణ్ మృతికి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 1975లో పండూ హవల్దార్ అనే మరాఠీ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశారు. ఆ సినిమాకు తన స్నేహితుడు సురేంద్రతో కలిసి రామ్ లక్ష్మణ్ పేరుతో సంగీతం అందించారు. ఆ తర్వాత ఏడాదే సురేంద్ర మరణించడంతో, విజయ్ పాటిల్ తన మిత్రుడి జ్ఞాపకార్థం రామ్ లక్ష్మణ్ పేరుతోనే కొనసాగారు. ఆయన బాణీలు సమకూర్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, 100 డేస్, పత్తర్ కే పూల్ వంటి చిత్రాలు మ్యూజికల్ హిట్స్ అయ్యాయి.

బాలీవుడ్ పై క‌రోనా వైర‌స్ ప‌గ‌బ‌ట్టింది. ఫ‌స్ట్ వేవ్ లో బాలీవుడ్ ప‌రిశ్ర‌మ కొంద‌రు సినీయ‌ర్ న‌టులు క‌న్నూమూశారు. తాజాగా ఈ వైర‌స్ బారిన ప‌డి ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌కులు, న‌టులు క‌న్నూముశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories