కన్నడ చిత్ర దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత

కన్నడ చిత్ర దర్శకుడు నగేష్ బాబు కన్నుమూత
x
Highlights

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు నగేష్ బాబు మంగళవారం (అక్టోబర్ 6) బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో..

కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. దర్శకుడు నగేష్ బాబు మంగళవారం (అక్టోబర్ 6) బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఆయన గత కొన్ని నెలలుగా వయస్సు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు.. దాంతో చికిత్స కోసం ఇటీవల బెంగళూరులోని ఆసుపత్రిలో చేరారు...ఆయనకు నయం చేసేందుకు వైద్య నిపుణుల తీవ్రంగా ప్రయత్నాలు చేసినప్పటికీ రెండురోజులుగా ఆయన ఆరోగ్యం మరింత విషమించింది. దాంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. నాగేష్ బాబుకు భార్య శ్యామల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన అభిమానులు, స్నేహితులు చాలా మంది నగేష్ బాబు మరణం పట్ల సంతాపం తెలిపారు. మాండ్యా జిల్లాలో జన్మించిన నగేష్ బాబు ప్రేమదా పుత్రి (1957) చిత్రంతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించారు. హిట్ కన్నడ చిత్రాలైన తూగుదీపా, నాన్నా కర్తవ్య చిత్రాలకు డైలాగ్ రైటర్ గా కూడా పనిచేశారు.

ఆ తరువాతి సంవత్సరాల్లో, నగేష్ బాబు బెంగళూరులోని గాంధీ నగర్ప్ర లో ప్రగతి స్టూడియోస్ పేరుతో స్టూడియోను ప్రారంభించారు. అక్కడ తన సోదరుడు అశ్వత్ నారాయణంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు స్టిల్ ఫోటోగ్రఫీని నేర్పించాడు. ఆ తరువాత కొన్ని చిత్రాలను నిర్మించారు. 2009 లో, నగేష్ బాబు ఇంగ్లీషులో తత్వామసి-యు ఆర్ దట్ పేరుతో 87 నిమిషాల డాక్యుమెంటరీని రూపొందించారు, ఇది అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శితం అయింది. 24 క్రాఫ్ట్ లలో మంచి పట్టున్న డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించిన నగేష్ బాబు మృతి కన్నడ చిత్ర సీమను షాక్ కు గురిచేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories