Venkatesh: తన 75 వ సినిమా కోసం డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన వెంకీ

Venky Has Fixed a Director For his 75th Film
x

Venkatesh: తన 75 వ సినిమా కోసం డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన వెంకీ

Highlights

Venkatesh: "హిట్ 2" డైరెక్టర్ తో మైలురాయి సినిమాని సైన్ చేసిన వెంకటేష్

Venkatesh: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఒకవైపు మాస్ మసాలా ఎంటర్టైనర్లతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూనే మరోవైపు విభిన్న సినిమాలను కూడా ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు వెంకటేష్. అటు ఫామిలీ డ్రామా అయినా ఇటు విభిన్న కథ అయినా వెంకటేష్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటారు.

తాజాగా వెంకటేష్ ఇప్పుడు తన కరియర్ లో ఒక మైలురాయిని చేరుకోబోతున్నారు. త్వరలోనే వెంకటేష్ తన కెరియర్ లోని 75వ సినిమాకి శ్రీకారం చుట్టబోతున్నారు. తాజాగా ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ లేదా డైరెక్టర్ తేజ లతో వెంకటేష్ తన మైలురాయి సినిమాని చేస్తారని గతంలో ప్రచారం జరిగింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తారని, వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఒక పోస్టర్ కూడా విడుదలైంది. బ్లాక్ సూట్ లో వెంకీ చాలా స్టైలిష్ గా కనిపించి అభిమానులకి కనుల విందు చేశారు.

కానీ ఈ సినిమా ఆగిపోయి ఇప్పుడు వెంకీ మళ్లీ తన మైలురాయి సినిమాకి డైరెక్టర్ కోసం వెతకడం మొదలుపెట్టారు. త్రినాధ రావు నక్కిన వంటి డైరెక్టర్లు కథ చెప్పారు కానీ వెంకీకి అవి నచ్చలేదట. తాజాగా ఇప్పుడు "హిట్ 2" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శైలేశ్ కొల‌ను చెప్పినా కథ వెంకటేష్ కి బాగా నచ్చేసింది అని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తోంది. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మించబోతున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories