Vakeel Saab: కోర్టు కు వకీల్ సాబ్

Vakeel Saab Vs AP CM Jagan
x

Vakeel Saab: కోర్టు కు వకీల్ సాబ్ 

Highlights

Vakeel Saab: ఆంధ్రప్రదేశ్‌లో వకీల్‌ సాబ్‌ మూవీ టికెట్ల ధరలపై రచ్చ మరింత ముదురుతోంది.

Vakeel Saab: ఆంధ్రప్రదేశ్‌లో వకీల్‌ సాబ్‌ మూవీ టికెట్ల ధరలపై రచ్చ మరింత ముదురుతోంది. టికెట్ల ధరల పెంపుపై ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా పెంపుకు సిద్దమైన థియేటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు జగన్ సర్కార్‌ ఝలక్‌ ఇచ్చింది. టికెట్లు పెంచితే చర్యలు తప్పవని స్పష్టం చేసింది. దీంతో హైకోర్టును ఆశ్రయించిన బయ్యర్లు మూడు రోజుల పాటు పెంపుకు అనుమతి తెచ్చుకున్నారు. అయితే దీనిపైన కూడా ఆగ్రహంగా ఉన్న జగన్ సర్కార్ హైకోర్టులో హౌస్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేసింది.

గతంలో భారీ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకోవాలంటే చిత్ర యూనిట్లు, బయ్యర్లు ప్రభుత్వాన్ని అనుమతి కోరేవారు. అవసరమైతే ప్రభుత్వంతో లాబీయింగ్ చేసుకుని అనుమతులు తెచ్చుకునే వారు. కానీ పవన్ కళ్యాణ్‌ నటించిన రీమేక్‌ చిత్రం వకీల్‌సాబ్‌ విషయంలో మాత్రం ఈసారి అలా జరగలేదు. అటు వకీల్‌ సాబ్‌ చిత్ర నిర్మాతలు, ఇటు ప్రభుత్వం పట్టుదలకు పోవడంతో టికెట్ల పెంపు వ్యవహారం ఏపీలో వార్‌ను తలపిస్తోంది.

మరోవైపు వకీల్‌సాబ్‌ సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలు చేసిన విజ్ఢప్తిని గత నెల 25న హైకోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వం అంగీకరించకపోవడంతో కాకినాడలో థియేటర్ల యాజమాన్యాలకు స్ధానిక అధికారులు నోటీసులు పంపారు. ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, పెంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో థియేటర్ల యాజమాన్యాలు తిరిగి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు కాకినాడ జేసీపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు ఆదేశాలు ఇచ్చింది.

తాజాగా ప్రభుత్వం మొండిపట్టు, థియేటర్ల యాజమాన్యాల వినతుల నేపథ్యంలో హైకోర్టు మూడు రోజుల పాటు టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వరకూ టికెట్ల ధరల పెంపుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో థియేటర్ల యాజమాన్యాలు కూడా టికెట్లు పెంచేందుకు సిద్దమయ్యాయి. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాకపోయినా ప్రభుత్వం మాత్రం ఉన్నత స్దాయిలో చర్చించి దీనికి కూడా నో చెప్పాలని నిర్ణయించింది.

అనుకున్నదే తడవుగా వకీల్ సాబ్ టికెట్ ధరలపై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఈ ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేసింది. ఇవాళ సాయంత్రం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకావం కనిపిస్తోంది. ఇవాళ శనివారం కావడంతో కోర్టుకు సెలవు. దీంతో హైకోర్టు న్యాయమూర్తి ఇంటి నుంచే ఈ పిటిషన్‌ను విచారించి ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం రాజకీయంగా రచ్చ జరుగుతున్నా ఎట్టి పరిస్దితుల్లోనూ వకీల్‌సాబ్‌ టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చిచెబుతోంది.

అటు బీజేపీ, జనసేన నేతలు కూడా ఈ ఇష్యూపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ప్రభుత్వం కుట్రతోనే వకీల్ సాబ్ సినిమాను టార్గెట్ చేసిందని మండిపడుతున్నారు. వకీల్ సాబ్ సినిమాను రాజకీయం చేసి మీరు పవన్ కల్యాణ్ కు షాకిస్తే 17న వైసీపీకి ప్రజలు, పవన్ అభిమానులు షాకివ్వబోతున్నారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

మరోవైపు ఏపీలో వకీల్ సాబ్ బెనిఫిట్ షోలు ఎందుకు రద్దు చేశారని బీజేపీ నేత సునీల్‌ థియేధర్ ప్రశ్నించారు‌. పవన్ అంటేనే కాదు, ఆయన సినిమా అంటే కూడా జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. తిరుపతిలోని జయశ్యాం థియేటర్ దగ్గర సునీల్ నిరసన చేశారు. తిరుపతిలో పవన్ కవాతు చేసినప్పుడు అసలు సినిమా రిలీజైందని వ్యాఖ్యానించారు. మోదీ, పవన్ చూపించబోయే సినిమాలకు జగన్ ఆటవిక రాజ్యం అంతమవుతుందన్నారు. ఏపీ బీజేపీ వ్యవహారాల సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

మరోవైపు సునీల్ థియోధర్‌కు మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు. వకీల్‌ సాబ్‌ సినిమా కోసం బీజేపీ నేత సునీల్ దేవధర్ నిరసనకు దిగడం ఏంటని ప్రశ్నించారు. పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకోవడానికి బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వాలా అని నిలదీశారు. బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా అని సునీల్ ను ప్రశ్నించారు. వకీల్ సాబ్ హిట్ కు తిరుపతిలో బీజేపీ గెలుపునకు సంబంధం ఏమిటని ఎద్దేశా చేశారు. బీజేపీ, పవన్ మధ్య వ్యాపారం సంబంధమేనని విమర్శించారు. ఇప్పటికే ప్రజా కోర్టులో వకీల్ సాబ్ వాదన సూపర్ సక్సెస్ అయింది. మరి హైకోర్టులో జరగబోయే వాదనల్లో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories