UI Movie: ఊహకందని క్లైమాక్స్‌తో ఉపేంద్ర 'యూఐ' మూవీ.. విడుదలకు సిద్ధం..

UI Movie
x

UI Movie: ఊహకందని క్లైమాక్స్‌తో ఉపేంద్ర 'యూఐ' మూవీ.. విడుదలకు సిద్ధం..

Highlights

UI Movie: ఆయన స్వీయ దర్శకత్వంలో 'యూఐ' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 20వ తేదీన విడుదల చేయనున్నారు.

UI Movie: భారతీయ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్ హీరోల్లో కన్నడ ఉపేంద్ర (Upendra) ఒకరు. ఉపేంద్రకు తెలుగులోనూ ఎంతో ఫాలోయింగ్‌ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైవిధ్యభరితమైన కథాంశాలతో ప్రేక్షకులను పలకరించే ఉపేంద్రకు తెలుగులోనూ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. మరీ ముఖ్యంగా 90లలో ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ మూవీఎస్‌తో టాప్‌ హీరోల్లో ఒకరిగా చోటు దక్కించుకున్నారు.

విభిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేయడం ఉపేంద్ర స్టైల్. అప్పట్లో ఉపేంద్ర సినిమా అంటే కర్నాటకలో థియేటర్స్ వద్ద జాతరను తలిపించే వాతావరణం ఉండేది. కేవలం హీరోగా మాత్రమే కాకుండా దర్శకత్వంలోనూ తన సత్తా చాటారు ఉపేంద్ర. అయితే ఇటీవల దర్శకత్వానికి గ్యాప్‌ ఇచ్చిన ఉపేంద్ర హీరోగా, విలన్‌ పాత్రలో నటిస్తూ వస్తున్నారు. తెలుగులో అల్ల అర్జున్‌ హీరోగా వచ్చిన సనాఫ్‌ సత్యమూర్తి సినిమాతో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించారు. ఇదిలా ఉంటే చాలా గ్యాప్‌ తర్వాత ఉపేంద్ర మళ్లీ మెగా ఫోన్‌ పట్టారు.

ఆయన స్వీయ దర్శకత్వంలో 'యూఐ' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్‌ 20వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ లో టాలీవుడ్ ఆడియెన్స్ తో ముచ్చటిస్తూ 'యూఐ' సినిమాతో సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్నాం అని, ఈ సినిమా క్లైమాక్స్ సైతం మీరు ఊహించిన దానికంటే కొత్తగా ఉంటుంది అని ఉపేంద్ర చెప్పుకొచ్చారు.

ఇంత వరకు రాని విభిన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో ఉపేంద్ర నుంచి ఇలాంటి సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాల సృష్టిస్తున్న నేపథ్యంలో 'యూఐ' సినిమా ఎంతమేర కలెక్షన్లను సాధిస్తుందోనని ట్రేడ్ గమనిస్తోంది. 'యుఐ' డబ్బింగ్ మూవీ అయినప్పటికీ టాలీవుడ్ లో ఉపేంద్ర సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండటంతో ఈ సినిమా బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూస్తారని ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories