Upasana: ఇండిపెండెన్స్ డే వేళ సంచలన ట్విట్ చేసిన ఉపాసన

Upasana Sensational Tweet on Kolkata Doctor Rape and Murder Issue
x

Upasana: ఇండిపెండెన్స్ డే వేళ సంచలన ట్విట్ చేసిన ఉపాసన

Highlights

Upasana: కోల్‌కతాకు చెందిన జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసింది.

Upasana: కోల్‌కతాకు చెందిన జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసింది. ఈ దారుణ సంఘటనపై యావత్‌ దేశం కోపంతో ఊగిపోతోంది. వైద్యురాలిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. మెడికల్ విద్యార్థులు మొదలు సెలబ్రిటీల వరకు ఈ హేయమైన చర్యపై ఘాటుగా స్పందిస్తున్నారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఘటనపై మెగా కోడలు, రామ్‌చరణ్‌ భార్య ఉపాసన స్పందించారు. ఎక్స్‌ వేదికగా తీవ్ర ఆవేదవ వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఉపాసన చేసిన ఈ పోస్ట్ వైరల్‌ అవుతోంది. జైహింద్‌ అనే యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేసిన ఈ పోస్ట్ ఆలోజింపచేస్తోంది.

ఉపాసన ట్వీట్ చేస్తూ.. 'మానవత్వం లేకపోవడం చూస్తుంటే అసహ్యంగా ఉంది. మహిళా వైద్యురాలిపై ఇలాంటి దారుణం జరగడం బాధాకరం. దీన్ని ఎవరూ సహించరు. జీవితానికి గౌరవం ఎక్కడుంది?. మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతుంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా? ఆ అమ్మాయిపై అలా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో మనిషే కాదు. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు ప్రధానపాత్ర పోషిస్తారు. శ్రామిక శక్తిలో 50 శాతానికి పైగా ఉన్నారు. ఎక్కువ మంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణలో వారి సహకారం చాలా ముఖ్యమైనది. ఈ కోల్‌కతా ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి స్త్రీకి భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు’ అంటూ రాసుకొచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories