పెళ్లి చూపుల్లో ఉపాసన ప్రశ్న.. చరణ్‌ సమాధానంకు అందరూ ఫిదా..

పెళ్లి చూపుల్లో ఉపాసన ప్రశ్న.. చరణ్‌ సమాధానంకు అందరూ ఫిదా..
x
Highlights

Upasana question to Ram Charan in their pelli choopulu: రామ్ చరణ్, ఉపాసన జంట గురించి పరిచయం అక్కర్లేదు. పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ గుర్తింపు...

Upasana question to Ram Charan in their pelli choopulu: రామ్ చరణ్, ఉపాసన జంట గురించి పరిచయం అక్కర్లేదు. పాన్ ఇండియా హీరోగా రామ్ చరణ్ గుర్తింపు తెచ్చుకోగా.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్‌గా ఉపాసన పేరు తెచ్చుకున్నారు. అయితే వీళ్ల పెళ్లి గురించి ఇప్పుడు ఓ ఆసక్తికరమైన ఘటన బయటకు వచ్చింది. అదేంటంటే పెళ్లి చూపుల్లో ఉపాసన.. రామ్ చరణ్‌ను అడిగిన ప్రశ్న. పెళ్లయిన తర్వాత మీరు ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? నాకా? మీ అమ్మగారికా అని అడిగారంట ఉపాసన. రామ్ చరణ్‌ను ఉపాసన అడిగిన ప్రశ్న విని అందరూ షాకయ్యారట. చిరంజీవి కూడా అందుకు మినహాయింపేం కాదు. గతంలో ఎప్పుడో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి.

రామ్ చరణ్, ఉపాసన ప్రేమించుకుని.. ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరువురు వారి పెద్దలకు తెలియజేసిన తర్వాత.. సాంప్రదాయ పద్దతిలో ఇరు కుటుంబాలు పెళ్లి చూపులు ఏర్పాటు చేశాయి. ఆ సమయంలో ఉపాసన పెళ్లైన తర్వాత మీ అమ్మగారికి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారా.. లేదంటే నాకు ప్రాధాన్యత ఇస్తారా అని అడిగారట.

ఉపాసన అడిగిన ఈ ట్రిక్కీ ప్రశ్నకు రామ్ చరణ్ కూడా అంతే తెలివిగా జవాబిచ్చాడట. తల్లిని ప్రేమించే ప్రతీ కొడుకు, తన భార్యను కూడా అదేవిధంగా ప్రేమిస్తాడు. ప్రతీ స్త్రీని గౌరవిస్తాడు. ఇద్దరినీ సమానంగా చూసుకుంటాడు అని సమాధానం ఇచ్చాడట రామ్ చరణ్. దీంతో అక్కడున్న వారంతా చరణ్ సమాధానికి చప్పట్లు కొట్టి మెచ్చుకున్నారు. ఆయన సమాధానానికి ఇరుకుటుంబాలు ఫిదా అవ్వడం పక్కన పెడితే.. చరణ్ సమాధానికి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మెగా పవర్ స్టార్ అంటే అట్లుంటది మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

ఇక రామ్ చరణ్-ఉపాసన జంటకు 11 ఏళ్ల తర్వాత క్లింకార అనే పాప జన్మించింది. ఆ పాప జన్మించిన తర్వాత మెగా కుటుంబంలో ఒక కొత్త ఆనందం తెచ్చిందని.. క్లింకార పుట్టిన తర్వాత తమ కుటుంబంలో సంతోషం రెట్టింపయ్యిందని మెగా కుటుంబ సభ్యులు చాలా సందర్బాల్లో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా పవర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories