Upasana Konidela: నాక్కూడా అలా కావాలని ఉంది.. అనన్య సిరీస్‌పై ఉపాసన రియాక్షన్‌

Upasana Give her Review About Ananya Pandays Call Me Bae Web Series
x

Upasana Konidela: నాక్కూడా అలా కావాలని ఉంది.. అనన్య సిరీస్‌పై ఉపాసన రియాక్షన్‌

Highlights

Upasana Konidela: మెగా హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం మెగా కోడలిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

Upasana Konidela: మెగా హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. కేవలం మెగా కోడలిగానే కాకుండా వ్యాపారవేత్తగానూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక వ్యక్తిగతంగా, వ్యాపారంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు ఉపాసన. సినిమాలతో పాటు సామాజిక అంశాలపై నిత్యం తన అభిప్రాయాన్ని పంచుకుంటుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా ఓ వెబ్‌ సిరీస్‌ను వీక్షించిన ఉపాసన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అనన్య పాండే నటించిన 'కాల్‌ మీ బే' అనే వెబ్‌ సిరీస్‌ను ఇటీవల చూశానని తెలిపిన ఉపాసన, తనకు ఆ సిరీస్‌ ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ సిరీస్‌ చూసిన తర్వాత తనకు కూడా సోషల్‌ మీడియా జర్నలిస్ట్‌ కావాలనే కోరిక కలిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు అనన్య.

ఇదిలా ఉంటే ఈ సిరీస్‌పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సారా అలీఖాన్‌, అలియా, నేహా దుఫియా వారి ఇన్‌స్టాలో ఈ సిరీస్‌పై (Call Me Bae) పోస్ట్‌లు పెట్టారు. ఇలాంటి సిరీస్‌లో నటించినందుకు అనన్యను ప్రశంసిస్తున్నారు. ‘నిన్ను చూస్తుంటే గర్వంగా’ ఉందని ప్రశంసిస్తున్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

సిరీస్‌ కథ విషయానికొస్తే.. ఈ సిరీస్‌ ఓ ధనిక మహిళ చుట్టూ తిరుగుతుంటుంది. ధనవంతురాలైన ఓ మహిళ తన సంపదను కోల్పోయిన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగింది అనే అంశాన్ని ఇందులో చూపించారు. భర్త విడిచివెళ్లాక ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.



Show Full Article
Print Article
Next Story
More Stories