Unstoppable with NBK: చంద్రబాబుకు బాలయ్య కాంట్రవర్సీ ప్రశ్నలు.. ఆసక్తి పెంచేసిన ప్రోమో
Unstoppable with NBK: తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వేదికగా అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎసిపోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Unstoppable with NBK: అన్ స్టాపబుల్ విత్ ఎన్.బీ.కే టాక్ షో 4వ సీజన్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈ టాక్ షో 4వ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా ప్లాన్ చేశారు. తొలి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా వేదికగా అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటల నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. మొదటి ఎసిపోడ్‌లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
సుదీర్ఘంగా సాగిన ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా వైసీపీ అధికారంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. జైలు జీవితానికి సంబంధించిన ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది. 'మా బావ గారు.. మీ బాబు గారు' అంటూ బాలకృష్ణ మాటలతో మొదలైన ప్రోమో ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడిని బాలయ్య చాలా కాంట్రవర్సీ ప్రశ్నలు అడిగారని తెలుస్తోంది.
ఈ ఎపిసోడ్లో.. జైలు జీవితం చంద్రబాబునాయుడిలో సీమపౌరుషాన్ని నిద్రలేపిందా? వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కటకటాలపాలు చేసి కక్ష తీర్చుకోవాలన్న కసి వచ్చిందా? మాజీ సీఎంకు వ్యతిరేకంగా చంద్రబాబు సిద్ధం చేసిన ఫైల్స్ ఏంటి? అని బాలయ్య అడిగాడని తెలుస్తోంది. జైలు జీవితం చంద్రబాబులో మరో మనిషిని నిద్ర లేపిందా? జగన్ ఇక తీవ్ర పర్యవాసానాలు చూడబోతున్నారా? అని సంధించారట. స్కిల్ డెవలెప్ మెంట్ కేసులో సీఎం చంద్రబాబు చెబుతున్నదేంటి? అని కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగారని స్పష్టమవుతోంది.
ఏ నిర్ణయం తీసుకోవడంలో నైనా అచితూచి వ్యవహరించే చంద్రబాబు, గత అయిదేళ్ల పరిణామాలు చూసిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులకు దూకుడుగా సమాధానమిస్తారా లేదా ఎప్పటిలాగే వ్యవహరిస్తారా? అని ప్రశ్నించారు. 53రోజులు చంద్రబాబునాయుడు జైల్లో ఎలా గడిపారు ? సీఎంగా జైళ్లను ఆధునీకరించిన చంద్రబాబు.. ఓ నిందితుడిగా ఆ గదుల్లోనే గడపాల్సి రావడంతో ఎలా ఫిలయ్యారు? రాజమండ్రి జైల్లో వీఐపీగా గడిపారా.? భయంతో ఉక్కిరిబిక్కిరిఅయ్యారా? అనే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు గోడల మధ్య నుంచి చంద్రబాబునాయుడు చూసిన ప్రపంచం ఎలా ఉంది? చదివిన పత్రికలేంటి? చూసిన టీవీలేంటి? కొత్తగా అలవర్చుకున్న అలవాట్లేంటి? అంటూ బాలకృష్ణ పలు ఆసక్తికరమైన ప్రశ్నలను సంధించారు.
టీడీపీ-జనసేన మధ్య పొత్తును పవన్‌కల్యాణ్ ప్రకటించడానికి కొద్ది నిమిషాల ముందు రాజమండ్రిలోని సెంట్రల్ జైలు నాలుగుగోడల మధ్య జరిగిన మంత్రాంగమేంటి? అని ప్రశ్నించారు. అలాగే లోకేష్, పవన్‌కల్యాణ్, బాలయ్య ముగ్గురిలో చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు? అని అడిగినట్లు తెలుస్తోంది. ఇలా షో మొత్తం బాలయ్య, చంద్రబాబును ఇరుకున పెట్టే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది.
Two unstoppable forces, one epic show! 💥🔥
— ahavideoin (@ahavideoIN) October 22, 2024
విజయసాధనలో పడ్డ ఇబ్బందులు,
జనసేనానితో తనకున్న అప్యాయతలు,
ఇలా ఎన్నో అంశాలు, అనుభూతులు,
బాలచంద్రుల ముచ్చట్లలో మీ ముందుకు!#UnstoppableS4 premieres on Oct 25, 8:30 PM.#Chandrababunaidu #UnstoppableWithNBK #NandamuriBalakrishna pic.twitter.com/V3UkpxyxoI
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire