UI Movie OTT: ఓటీటీలోకి రానున్న ఉపేంద్ర 'యూఐ' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

UI Movie OTT
x

UI Movie OTT: ఓటీటీలోకి రానున్న ఉపేంద్ర 'యూఐ' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Highlights

UI Movie OTT release date: యూఐ మూవీ ఓటీటీ హక్కులను సన్‌ నెక్ట్స్‌ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో కూడా ఇదే ఓటీటీలో వస్తుందా? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంటుంది.

UI Movie OTT release date: వైవిధ్యభరితమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు కన్నడ హీరో ఉపేంద్ర. ముఖ్యంగా ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం యూఐ. డిసెంబర్‌ 20వ తేదీన పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది.

కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్‌ సొంతం చేసుకుంది. వైవిధ్యమైన కథాంశంతో వచ్చిన సినిమా ఉపేంద్ర అభిమానులను తెగ ఆకట్టుకుంది. కాగా థియేటర్లలో ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దమవుతోంది. యూఐ మూవీ ఓటీటీ హక్కులను సన్‌ నెక్ట్స్‌ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో కూడా ఇదే ఓటీటీలో వస్తుందా? లేదా అన్న విషయం తెలియాల్సి ఉంటుంది.

సన నెక్ట్స్‌ ఈ సినిమా ఓటీటీ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు సమాచారం. తమిళ్‌ వెర్షన్‌తో పాటు ఇతర అన్ని భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. సినిమా స్ట్రీమింగ్ కరెక్ట డేట్ ఎప్పుడన్న దానికి సంబంధించి ఎలాంటి అధారిక ప్రకటన చేయకపోయినప్పటికీ ఈ నెల 15వ తేదీ తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ సమయానికి సినిమా విడుదలై కేవలం 25 రోజులు మాత్రమే అవుతుంది. ఈ లెక్కన యూఐ మూవీ థియేటర్లలోకి వచ్చి నెల రోజుల్లోపై ఓటీటీలో సందడి చేయనుందన్నమాట.

ఇదలా ఉంటే చాలా రోజుల తర్వాత మెగా ఫోన్‌ పట్టుకున్న ఉపేంద్ర మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. విడుదలైన తొలిరోజే రూ. 7 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో రీష్మా నానయ్య ప్రధాన పాత్ర పోషించారు. లహరి వేలు, కేపీ శ్రీకాంత్‌లు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories