TSPSC Paper Leak: TSPSC నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు

TSPSC Paper Leak Remand Report Of Accused Reveal Key Points
x

TSPSC Paper Leak: TSPSC నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడవుతున్నకీలక అంశాలు

Highlights

TSPSC Paper Leak: 19మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్న సిట్

TSPSC Paper Leak: TSPSC నిందితుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు పేర్కొన్నారు. ఇప్పటివరకు 12మందిని అరెస్ట్ చేసినట్లు సిట్ పేర్కొంది. నిందితుల్లో నలుగురు TSPSC, మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇంత వరకు 19మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. TSPSC ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా.. TSPSC, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను కూడా సాక్షులుగా పేర్కొంది. అలాగే కర్మన్‌ఘాట్‌లోని హోటల్ యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొంటూ.. హోటల్ సీసీటీవీ కెమెరాలో పేపర్ ఎక్సేంజ్ వ్యవహారం రికార్డ్ అయినట్లు సిట్ అధికారులు పేర్కొన్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి సమాచారంతో షమీమ్, రమేష్, సురేష్ అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుంచి ల్యాప్‌టాప్, 3 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories