మరోసారి ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. ప్రధాని మోడీతో భేటీ...

TS Governor Tamilisai Soundararajan Delhi Tour Today 19 04 2022 | Live News
x

మరోసారి ఢిల్లీకి గవర్నర్ తమిళి సై.. ప్రధాని మోడీతో భేటీ...

Highlights

Tamilisai Soundararajan: రాష్ట్రంలోని తాజా పరిస్థితులను ప్రధాని వివరించే ఛాన్స్...

Tamilisai Soundararajan: తెలంగాణ గవర్నర్ తమిళి సై(Tamilisai Soundararajan) మరోసారి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కునున్నారు. కొద్ది రోజుల క్రితం గవర్నర్ ఢిల్లీ టూర్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపణలు రేపింది. ప్రోటోకాల్ అంశాలపై ప్రధాని మోడీ(PM Narendra Modi) కి, హోమంత్రి అమిత్‌షా(Amit Shah) కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించటం కాదని.. గవర్నర్ వ్యవస్థను అవమానిచారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యల పైన తెలంగాణ మంత్రులు సైతం కౌంటర్ ఇచ్చారు.

కేంద్ర సహాయమంత్రి జితేందర్ సింగ్ కుమారుడి వివాహానికి గవర్నర్ హాజరుకానున్నారు. ఇవాళ మరోసారి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసే అవకాశం వుందని తెలుస్తోంది. తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారంపై నివేదిక ఇచ్చినట్లుగా గత పర్యటనలో ప్రచారం జరిగింది. ఇక, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల పైన మరోసారి ప్రధానితో సమావేశమైన సమయంలో గవర్నర్ వివరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో పరిస్థితుల పైన తాను ప్రత్యేకంగా ప్రధాని - హోం మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదని..అన్నీ వారికి తెలుసంటూ గవర్నర్ వ్యాఖ్యానించారు. దీంతో..ఇప్పుడు మరోసారి గవర్నర్ ఢిల్లీ టూర్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు సీఎం కేసీఆర్ సైతం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర లక్ష్యంగా హస్తిన బాటపట్టనున్నారు.

జాతీయ రైతు సంఘం నాయకులతో భేటి అవుతారని తెలుస్తుంది. ఢిల్లీ నుండి సీఎం కేసీఆర్(KCR) యూపీ వెళ్లనున్నారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ఆయా సంఘాలతో సమావేశం కానున్నారు. రైతు సంఘం నాయకుడు టికాయత్ తో కలిసి లఖింపూర్ కేరి(Lakhimpur Kheri) ఘటనలో చనిపోయిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేసే అవకాశముందని తెలుస్తోంది. అనంతరం లక్నోలో అఖిలేష్ యాదవ్ ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ వ్యతిరేక విధానాలపై అఖిలేష్ యాదవ్(Akhilesh yadav) తో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories