Trisha Krishnan: నా కొడుకు చనిపోయాడంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్.. అసలు విషయమేమిటంటే..?

Trishas Son Zorro Passes Away On Christmas
x

Trisha Krishnan: నా కొడుకు చనిపోయాడంటూ త్రిష ఎమోషనల్ పోస్ట్.. అసలు విషయమేమిటంటే..?

Highlights

Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తన కొడుకు చనిపోయాడని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది.

Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) తన కొడుకు చనిపోయాడని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తాను షాక్‌లో ఉన్నానని ఈ బాధ నుంచి తన ఫ్యామిలీ బయటపడేందుకు సమయం పడుతుందని చెప్పింది. ఇక్కడ జోర్రో (Zorro) అంటే త్రిష పెంపుడు కుక్క. అది అంటే తనకు ఎంత ఇష్టమో తన పోస్టు చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం త్రిష చేసిన ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

త్రిష సోషల్ మీడియాలో ఈ విషయం ట్వీట్ చేస్తూ నా ప్రియమైన కొడుకు జోర్రో మరణించాడు. ఈ క్రిస్మస్ రోజు తెల్లవారుజామున చనిపోయాడు. నా గురించి బాగా తెలిసిన వాళ్లకు జొర్రో నాకు ఎంత ముఖ్యం అనేది బాగా తెలుసు. నేను నా ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధలో ఉన్నాము. ఈ బాధ నుంచి బయటపడడానికి సమయం కావాలి అంటూ ట్వీట్ చేసింది. జొర్రోకు సంబంధించిన ఫొటోలు, అంత్యక్రియలు పూర్తి చేసిన ఫొటోలను షేర్ చేసింది.

ఇక త్రిష సినిమాల విషయానికొస్తే 40 ఏళ్ల వయస్సులోనూ దక్షిణాది భాషలలో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా అవకాశాలు సొంతం చేసుకుంటోంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్నేళ్లయినా త్రిష క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే తమిళ్‌లో అజిత్ విడామూయార్చి, గుడ్ బాడ్ అగ్లీ చిత్రాలలో కూడా ఈమె హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే సూర్య, కమల్ హాసన్ నటించబోయే కొత్త సినిమాలలో కూడా త్రిష నటించబోతోంది. ప్రస్తుతం మలయాళంలో కూడా రెండు సినిమాలు చేస్తోంది.

కెరియర్లో బిజీగా ఉన్న త్రిష తన పెంపుడు కుక్క జొర్రో చనిపోయిందని పోస్ట్ పెట్టి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం త్రిష కన్నీటి పర్యంతమవుతుండడంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories