Trisha and Vijay: దొరికిపోయిన త్రిష, విజయ్...సంగీతకు అన్యాయం చేసినట్లేనా?

Trisha and Vijay:  దొరికిపోయిన త్రిష, విజయ్...సంగీతకు అన్యాయం చేసినట్లేనా?
x
Highlights

Trisha and Vijay: తమిళ సూపర్ స్టార్ విజయ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కొత్త పార్టీ కూడా పెట్టారు. భారీ జనాల మధ్య తన తొలి రాజకీయ ప్రసంగం కూడా...

Trisha and Vijay: తమిళ సూపర్ స్టార్ విజయ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మధ్య కొత్త పార్టీ కూడా పెట్టారు. భారీ జనాల మధ్య తన తొలి రాజకీయ ప్రసంగం కూడా చేశారు. మొదటి స్పీచ్ తోనే అందర్నీ ఆకట్టుకున్నారు. అయితే విజయ్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. నిజానికి విజయ్ ఏ ఫంక్షన్ కు వెళ్లిన తన భార్య సంగీతతో క లిసి వెళ్తుంటారు. అయితే ఈ మధ్య ఒక్కడే వెళ్తున్నారు.

విజయ్ పక్కన సంగీత లేదు. ఇదే విషయం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిగ్గా మారింది. ఈ సమయంలోనే సింగర్ సుచిత్ర విజయ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడని..త్వరలోనే హీరోయిన్ త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ బాంబు పేల్చింది. ఆ మాటలను నిజంలా చేసేలా విజయ్ వ్యవహార శైలి ఉంది.

ఎందుకంటే మొన్న హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి సందర్బంగా త్రిష, విజయ్ కలిసి ప్రత్యేక విమానంలో గోవాకు వెళ్లారు. ఆ సమయంలో వీరిద్దరూ కాస్త మీడియా కంట్లో పడ్డారు. దాంతో కొంతమంది త్రిష కోసం విజయ్ తన భార్య సంగీతకు అన్యాయం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా జస్టిస్ ఫర్ సంగీత అనే ట్యాగ్ ట్రేండ్ చేస్తున్నారు. విజయ్ పాతికేళ్ల వైవాహిక జీవితంలో ప్రతివిషయంలోనూ సంగీత భర్తకు తోడుగా నిల్చుంది.


అలాంటి వ్యక్తికి అన్యాయం చేసి త్రిషతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం సరైందికాదంటూ విజయ్ ప్రవర్తన మార్చుకోవాలని తప్పుబడుతున్నారు. ఒక గొప్ప హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కాబోయే నాయకుడు ఇలా చేయడం ఏమాత్రం సరికాదంటూ విమర్శిస్తున్నారు. విజయ్ భార్య సంగీత అభిమానులు ఆమెకే సోషల్ మీడియా ద్వరా పెద్దెత్తున మద్దతుగా నిలుస్తున్నారు. మరి ఈ విషయం పై వారిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories