Tollywood: ఆగస్టులో టాలీవుడ్‌కు ట్రిపుల్‌ బ్లాక్ బస్టర్స్

Triple Blockbusters For Tollywood in August
x

Tollywood: ఆగస్టులో టాలీవుడ్‌కు ట్రిపుల్‌ బ్లాక్ బస్టర్స్

Highlights

Tollywood: సెప్టెంబరులో వరుస ప్లాపులు, టాక్ ఎలా ఉన్నా రాని ఓపెనింగ్స్

Tollywood: ఆగస్టు నెలలో విడుదలైన 'బింబిసార' దుల్కర్ సల్మాన్ 'సీతారామం' బ్లాక్ బస్టర్లుగా నిలవడం.. ఆ తరువాత వచ్చిన నిఖిల్ 'కార్తికేయ 2' దక్షిణాదితో పాటు ఉత్తరాదిలో భారీ స్థాయిలో విడుదలై రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడంతో... టాలీవుడ్ వర్గాల్లో సరికొత్త జోష్ మొదలైంది. కానీ అంతలోనే సెప్టెంబరు నెలలో సినిమాలు స్పీడ్ బ్రేకర్స్‌గా నిలిచాయి. ఈ ఎఫెక్ట్ దసారాకు రాబోయే భారీ చిత్రాలపై కూడా పడనుంది.

ఆగస్ట్‌లో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడమే కాకుండా... రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టడంతో టాలీవుడ్ హీరోలు మొదలుకొని, ట్రెడ్ వరకు అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతకముందు జూన్, జూలై నెల టాలీవుడ్‌కు చికటి రోజులుగా మారాయి. ఆ రెండు నెలల్లో రిలీజ్ అయిన సినిమాలు దాదాపుగా అన్నీ డిజాస్టర్లుగా నిలిచి ఇండస్ట్రీ వర్గాలను కలవరానికి గురిచేశాయి. ఒకానొక దశలో టాలీవుడ్ పరిస్థితి ఏంటా... అంటూ చాలా మంది దర్శక నిర్మాతలు హీరోలు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆగస్టులో విడుదలైన సినిమాలు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్‌లుగా నిలిచి ఊరట కలిగించాయి.

అయితే టాలీవుడ్ మళ్లీ గాడిలో పడిందని అనుకునేలోపే, వ్యవహారం గాడి తప్పుతున్నట్టు కనిపిస్తొంది. ఒకే ఒక జీవితం రివ్యూల పరంగా పర్వాలేదనిపించినా.. వసూళ్ళు నామమాత్రమే. ఇక ఆ తరువాత వచ్చిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. సుధీర్ బాబు కృతిశెట్టిల కాంబోలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కిరణ్ అబ్బవరం సినిమా నేను మీకు బాగా కావాల్సిన వాడిని, రెజీనా, నివేదా నటించిన సాకిని డాకిని చిత్రాలు కనీస ఓపెనింగ్స్‌ను కూడా రాబట్టుకోలేకపోయాయి. మరలా ఆడియన్స్‌కు మూడ్ మారినట్టుగా పరిస్దితి కన్పిస్తొంది. ఇది కాస్త దసరాకు రాబోతున్న చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది గోస్ట్ సినిమాలపై పడనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.‌ ప్రమోషన్స్ పరంగా అసలేమాత్రం ప్రభావం చూపలేకపోతున్న ఈ సినిమాలకు, బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories