Trinadha Rao Nakkina: మహిళా కమిషన్ సీరియస్.. హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు

Trinadha Rao Nakkina apology to Actress Anshu and all other women after Telangana women commission reaction
x

Trinadha Rao Nakkina: మహిళా కమిషన్ సీరియస్.. హీరోయిన్ అన్షుకు క్షమాపణలు చెప్పిన దర్శకుడు

Highlights

Trinadha Rao Nakkina comments on Actress Anshu: నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ సీనియర్...

Trinadha Rao Nakkina comments on Actress Anshu: నటి అన్షుపై దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఓ సీనియర్ హీరోయిన్‌పై ఇలాంటి దారుణమైన కామెంట్లు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దిగొచ్చిన దర్శకుడు తాజాగా క్షమాపణలు చెప్పారు. "అన్హుతో పాటు నా మాటల వల్ల బాధపడ్డ మహిళలందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఎవరికి బాధ కలిగించడం కాదు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పు తప్పే. మీరంతా పెద్ద మనస్సు చేసుకుని నన్న క్షమిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.

అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. సందీప్ కిషన్ హీరోగా రీతు వర్మ హీరోయిన్‌గా మజాకా మూవీ రూపొందుతోంది. ఇందులో రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ఈవెంట్ జనవరి 12న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా త్రినాథ రావు చేసిన కామెంట్లు హాట్ టాపిక్‌గా మారాయి.

మన్మథుడు సినిమా చూసి.. ఏందిరా ఈ అమ్మాయి లడ్డూలా ఉందని అనుకునేవాళ్లం. ఈ అమ్మాయిని చూసేందుకు మన్మథుడు సినిమాకి మళ్లీ మళ్లీ వెళ్లే వాళ్లం. అలాంటి అమ్మాయి కళ్ల ముందుకు వచ్చేసరికి ఓ క్షణం నమ్మలేకపోయాను. అన్షు కొంచెం సన్నబడింది. నేనే తనను లావు పెరగమని చెప్పా అంటూ ఇంకా కొన్ని చీప్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలకు అన్షు ఇబ్బంది పడడం కెమెరాల్లో కనిపించింది. హీరోయిన్ సైజుల గురించి ఇలా పబ్లిక్‌గా కామెంట్లు చేయడంతో త్రినాథ రావు నక్కిన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరోవైపు హీరోయిన్ అన్షూపై త్రినాథరావు చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ళ శారదా సీరియస్ అయ్యారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన త్రినాథ రావుకు త్వరలోనే నోటీసులు జారీ చేస్తామని ప్రకటించారు. దీంతో అన్షుతో పాటు తన మాటలకు బాధపడ్డ మహిళలందరికి క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు దర్శకుడు త్రినాథరావు.

మన్మథుడు తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమాలో నటించిన అన్షు.. ఆ తర్వాత సినిమాలకు ఫుల్‌స్టాప్ పెట్టేసి, పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లిపోయింది. 21 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. తాజాగా మజాకా సినిమాలో నటిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories